వివాదాల్లో ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్

Advertisement

కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు అన్ని కూడా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాయి. అయితే ఇప్పటికే రష్యా ఓ వ్యాక్సిన్ ను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటె ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ‘హరామ్’ నిషేధించబడినది అని అంటున్నారు. అలాగే ఆ వ్యాక్సిన్ ను ముస్లిం ప్రజలు వాడవద్దని ఆస్ట్రేలియాకు చెందిన ఓ మతపెద్ద ముస్లిం ప్రజలను కోరడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడి ఓ సూఫీ ఖలీఫా, ఈ వ్యాక్సిన్ ముస్లింలు వాడవద్దంటూ ఓ వీడియోను విడుదల చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.

అయితే ఈ వ్యాక్సిన్ ఏ మాత్రం మంచిది కాదని అనడు. అలాగే 1970 సంవత్సరంలో గర్భస్రావం చేయబడిన శిశువు యొక్క పిండ కణాలను ఈ శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేసి, వ్యాక్సిన్ లో ఉపయోగించారని ఆయన ఆరోపించారు. అలాగే పలువురు ముస్లింల శరీరాలపైనా కూడా ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించారని, ఇలా చేయడం సిగ్గు చేటని ఆయన కీలక వ్యాఖ్యలు చేసాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here