రష్యా వ్యాక్సిన్ తో సైడ్‌ ఎఫెక్ట్స్‌

Admin - September 18, 2020 / 09:41 AM IST

రష్యా వ్యాక్సిన్ తో సైడ్‌ ఎఫెక్ట్స్‌

కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక ఈ వైరస్ ను నివారించడానికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. ఇక ఇదే తరుణంలో రష్యా ఓ వ్యాక్సిన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక రష్యా తయారు చేసిన ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్ ప్రయోగాల్లో పాల్గొన్న ప్రతి ఏడుగురు వాలెంటీర్లలో ఒకరికి సైడ్ ‌ఎఫెక్ట్స్‌ వస్తున్నట్టు తెలిసింది.

ఈ వ్యాక్సిన్ ‌ ప్రయోగించిన వారిలో 14 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురాష్కో పేర్కొన్నారు. అయితే ఆ లక్షణాలు తరువాత రోజు సర్దుకున్నాయని ఆయన వివరించారు. స్పుత్నిక్-వి‌ టీకా తీసుకున్న తరువాత సగటున ఏడుగురిలో ఒకరికి బలహీనత, ఒంటినొప్పులు వంటి లక్షణాలు ఏర్పడ్డాయని ఆయన వెల్లడించారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us