Jagapathi Babu : సీనియర్ హీరోయిన్ తో జగపతి బాబు లవ్ ఎఫైర్.. మొత్తానికి చెప్పేశాడుగా..!
NQ Staff - February 15, 2023 / 01:44 PM IST

Jagapathi Babu : సినిమా హీరోలు చాలా మంది ప్రేమలో పడుతుంటారు. ఇందులో కొందరు మాత్రం ప్రేమించిన వారిని పెండ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం ప్రేమించి పెండ్లికి మాత్రం నో చెబుతుంటారు. కానీ ఒకానొక సమయంలో వారి వ్యవహారాలు మొత్తం బయటపడుతూనే ఉంటాయి. జగపతి బాబు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన విషయంలో కూడా అప్పట్లో ఎన్నో కామెంట్లు వచ్చాయి.
ఆయన అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఎంత బాగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కూడా మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. ఈ క్రమంలోనే జగపతి బాబు అప్పట్లో హీరోయిన్ సౌందర్యతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఆమెతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుతుండేవాడు.
ఆ బాధతోనే..
అయితే ఆయన సౌందర్యను పెండ్లి చేసుకుంటాడు అని అంతా అనుకున్నారు. కానీ సౌందర్య వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుంది. అప్పుడు జగపతి బాబు బాధపడ్డాడని ఆ బాధతోనే ఆయన కెరీర్ ను నాశనం చేసుకున్నాడంటూ ఎన్నో వార్తలు షికారు చేశాయి. అయితే తాజాగా వాటిపై స్పందించాడు జగ్గూ భాయ్.
నాకు సౌందర్యకు ఎలాంటి లవ్ ఎఫైర్లు లేవు. అవన్నీ నిజాలు కావు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. సౌందర్య వాళ్ల అన్నయ్య కూడా నాకు బాగా క్లోజ్. ఆ రకంగా సౌందర్య నాకు క్లోజ్ అయింది. అంతే తప్ప మా ఇద్దరి మధ్య అంతకు మించి ఎలాంటి రిలేషన్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు జగపతి బాబు.