RRR: ఆర్ఆర్ఆర్ నుండి విడుద‌లైన దోస్తీ పాట‌.. ప్ర‌మోష‌న‌ల్ వీడియో అదిరిందంటూ కామెంట్స్

RRR: ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ రూపంలో మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ సినిమాని దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. టాకీ పార్ట్ దాదాపు పూర్తి కాగా, సాంగ్స్ కోసం త్వ‌ర‌లో ఉక్రెయిన్‌కి వెళ్ల‌నున్నారు. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.

TheNewsQube-

అక్టోబర్‌ 13న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ని చిత్రబృందం భారీగానే ప్లాన్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ‘దోస్తీ’ పేరుతో ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1వ తేదీన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి విడుద‌లైన ‘దోస్తీ’ ప్రమోషనల్‌ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అలరిస్తుంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ లు సంగీత ద‌ర్శ‌కుడితో పాటు సింగర్స్‌తో జ‌ట్టుగా క‌నిపించ‌డం ఆక‌ట్టుకుంది.

ఈ ప్రమోషనల్‌ పాట కోసం ఐదు భాషలకు చెందిన ప్రముఖ గాయకులు హేమచంద్ర (తెలుగు), అనిరుధ్‌ (తమిళం), అమిత్‌ త్రివేది (హిందీ), విజయ్‌ ఏసుదాస్‌ (మలయాళం), యాజిన్‌ నైజర్‌ (కన్నడ)లను ఒకే తాటి మీదకు తీసుకువచ్చారు కీరవాణి. సినిమాలో హీరోలు ఇద్దరి మధ్య స్నేహాన్ని చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించారు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటించిన విష‌యం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి పదిభాషల్లో విడుదల చేస్తున్నారు.