ఫుట్ బాల్ ఆటగాడైన రోనాల్డో కారు ఖరీదెంతో తెలుసా?

Advertisement

ఫ్రాన్స్ కు చెందిన ఒక ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లా వా ట్యూర్‌ నొవార్‌ కారును తయారు చేసింది. అయితే ఈ కార్ ధర వింటే మాత్రం దిమ్మదిరిగి బొమ్మ కనబడుతుంది. ఈ కారు ధర అక్షరాల రూ. 75 కోట్లు. ఈ ఇప్పటి వరకు కేవలం పది మంది మాత్రమే కొన్నారు. ఆ పది జాబితాలో ఇప్పుడు ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో చేరాడు.

రూ. 75 కోట్లు పెట్టి ఈ కారును కొనుగోలు చేశారు. గంటకు 380 కిలో మీటర్స్ వేగంతో దూసుకుపోయే ఈ కారు కేవలం 2 సెకండ్స్ లొనే 60 కిలో మీటర్స్ వేగం అందుకోగలదు. ఇప్పటికే రొనాల్డో గ్యారేజ్‌లో ఇప్పటికే దాదాపు రూ. 264 కోట్ల విలువ చేసే కార్లుండడం విశేషం. 35 ఏళ్ల క్రిస్టియానో మొత్తం రూ. 788 కోట్లతో ఈ ఏడాది అత్యధిక ఆర్జన కలిగిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలే అతడు రూ. 53 కోట్లతో అత్యంత అధునాతన విహార నౌకను కూడా కొనుగోలు చేశాడు. ఈ కోవిడ్ కష్ట కాలంలో రోనాల్డో తన హోటల్స్ ను ఐసోలాషన్ వార్డ్స్ గా ఉపయోగించుకోవడానికి ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here