Rohit Sharma: ఇది ప‌క్కా మోసం.. రోహిత్ శ‌ర్మ అవుట్ కానే కాదు..!

Rohit Sharma: ప్ర‌స్తుతం భార‌త్,ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య మూడో టెస్ట్ ర‌స‌వ‌త్తరంగా సాగుతున్న‌సంగ‌తి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్‌ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (156 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, చతేశ్వర్‌ పుజారా (180 బంతుల్లో 91 బ్యాటింగ్‌; 15 ఫోర్లు) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్‌ కోహ్లి (94 బంతుల్లో 45 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు.


Rohit Sharma's Wicket Goes Out Controversial As wickets are completely Missing
Rohit Sharma’s Wicket Goes Out Controversial As wickets are completely Missing


దాదాపు రోజంతా ఓపిక‌గా ఆడిన భార‌త జ‌ట్టు రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయింది. మూడోరోజు ఆట ముగిసే స‌మ‌యానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. అంటే ఇంకా 139 ప‌రుగులు వెన‌క బ‌డే ఉంది. నాలుగో రోజు ఆట‌లో పుజారా, కోహ్లీ ఈ విధంగానే ఆడ‌డంతో పాటు వారికి రహానే, జడేజా, పంత్ అండ‌గా నిలిస్తే మూడో టెస్ట్ మ్యాచ్ చేజారిపోకుండా ఉంటుంది.


Rohit Sharma's Wicket Goes Out Controversial As wickets are completely Missing
Rohit Sharma’s Wicket Goes Out Controversial As wickets are completely Missing


అయితే భార‌త్ బ్యాటింగ్ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ అంపైర్ కాల్‌తో అవుట్ కావ‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీమిండియాను కాపాడే క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ చాలా ఆచితూచి ఆడుతూ వ‌స్తుండ‌గా, ఛతేశ్వర్ పూజారాతో కలిసి రెండో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి అవుట్ అయ్యాడు.రాబిన్‌సన్ బౌలింగ్‌లో షాట్ మిస్ అయిన రోహిత్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యినట్టు ప్రకటించాడు అంపైర్. వెంటనే డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్నాడు రోహిత్ శర్మ.


రీప్లేలో బంతి వికెట్ల‌ను మిస్ అవుతున్న‌ట్టుగా స్ప‌ష్టంగా కనిపిస్తుంది. కాని థ‌ర్డ్ అంపైర్ అంపైర్ కాల్ ప్ర‌కారం ఆన్ ఫీల్డ్ ఇచ్చిన నిర్ణాయానికి క‌ట్టుబ‌డి ఔట్ గా ప్ర‌క‌టించ‌గా, దీనిపై పెద్ద దుమారం న‌డుస్తుంది. అస‌లు అంపైర్స్ కాల్ అంటే బంతి, వికెట్లను కనీసం ఎడ్జ్‌లో అయినా తాకాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఊహాత్మకంగా బంతి గమనాన్ని అంచనా వేసే టెక్నాలజీ కంటే ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి విలువనిచ్చి… అంపైర్ కాల్‌గా ప్రకటిస్తారు.


కాని శ‌ర్మ విష‌యంలో బంతి వికెట్ల‌ను తాక‌కుండా పోతున్నట్టుగా ఉంది. ఇందులో చీటింగ్ ఉంది అంటూ నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతకుముందు జో రూట్ డీఆర్‌ఎస్ తీసుకోవడానికి లేట్ చేయడంలో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ, ఈ రూపంలో అవుట్ అయ్యాడ‌ని కొంద‌రు చెబుతున్నారు.