Rohit Sharma : కెప్టెన్ అయ్యాక రోహిత్ త‌గ్గ‌ట్లేదుగా.. ఎన్టీఆర్ త‌ర్వాత కాస్ట్‌లీ కారు ద‌క్కించుకుంది రోహిత్ మాత్ర‌మే..!

NQ Staff - March 1, 2022 / 09:20 PM IST

Rohit Sharma    :    కెప్టెన్ అయ్యాక రోహిత్ త‌గ్గ‌ట్లేదుగా.. ఎన్టీఆర్ త‌ర్వాత కాస్ట్‌లీ కారు ద‌క్కించుకుంది రోహిత్ మాత్ర‌మే..!

Rohit Sharma     :    సినీ సెలబ్రెటీలకు ఖరీదైన కార్లపై ఎంత మ‌క్కువ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్‌, మెర్సిడేస్‌, ఆడి వంటీ కార్లను తమ గ్యారేజ్‌లో చేర్చుకున్నారు. ఇదిలా ఉండగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసి దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు.3.16 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన లంబోర్ఘినీ ఊరుస్ కారుని ఎన్టీఆర్ ద‌క్కించుకోగా, ఇటీవ‌ల ఆ కారులో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాడు.

ఇటీవలే రోహిత్ శ‌ర్మ కూడా అత్యంత ఖరీదైన లంబోర్ఘిని సిరీస్ కొత్త మోడల్ ను కొనుగోలు చేశాడు. లంబోర్ఘిని కొత్త మోడల్.. ‘ఉరుస్’ ను హిట్ మ్యాన్ కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు కొత్త వాహనాలకు సంబంధించిన విషయాలను వెల్లడించే.. ఆటోమొబైలియర్డెంట్ తన ఇన్స్టా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. రోహిత్ కొన్న ఉరుస్ కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

Rohit Sharma surpasses new car

Rohit Sharma surpasses new car

‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ లంబోర్ఘిని బ్రాండ్ న్యూ మోడల్ అయిన ఉరుస్ ను కొన్నాడు..! ముంబైలోని లంబోర్ఘిని షోరూం ఇప్పటికే ఈ కారును రోహిత్ ఇంటికి డెలివరీ చేసింది. భారత జట్టు జెర్సీ కలరైన నీలి రంగు కారును కొనుగోలు చేశాడు..’ అని ఆటోమొబిలియర్డెంట్ పేర్కొంది. రూ. 3 కోట్ల విలువ చేసే ఈ కారుకు మెన్ ఇన్ బ్లూ జెర్సీ రంగు బ్లూ కలర్ నే కావాలని కొనుక్కున్నాడట రోహిత్.

‘కార్టూక్’ తెలిపిన సమాచారం మేరకు.. బయట బ్లూ కలర్ ఉన్న కారుకు లోపల కూడా తనకు నచ్చినట్టుగానే డిజైన్ చేసుకున్నాడు హిట్ మ్యాన్. చెర్రీ రెడ్ కలర్ లో సీట్లు ఉన్న ఈ కారుకు క్యాబిన్ మాత్రం బ్లాక్ కలర్ లో డిజైన్ చేయించాడు. మొత్తానికి ఇంత కాస్ట్‌లీ కారుని ఇండియాకి సంబంధించిన సెల‌బ్రిటీలు దక్కించుకోవ‌డం విశేషం.

వరుసగా మూడు బ్యాక్ టు బ్యాక్ సిరీస్ విజయాలతో పాటు టీ20లలో వరుసగా 12 విజయాలు సాధించిన భారత జట్టు.. మార్చి 4 నుంచి లంకతో టెస్టు మ్యాచు ఆడనున్నది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్.. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి వందో టెస్టు కానుంది.

Read Today's Latest గుసగుసలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us