Rohit sharma: యంగ్ లుక్‌లోకి మారిన రోహిత్ శ‌ర్మ‌.. భ‌లే క్యూట్‌గా ఉన్నావంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

Rohit sharma: ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్ అందుకున్న రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం గాయం కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అయ్యాడు. ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్‌, వ‌న్డే సిరీస్ జ‌రుగుతుండ‌గా, గాయం వ‌ల‌న ఈ రెండు సిరీస్‌ల‌కు రోహిత్ దూరంగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బరువు తగ్గడంతో పాటు న్యూ లుక్‌తో అదరగొట్టాడు.

rohit sharma new look
rohit sharma new look

గత కొంత కాలంగా జాతీయ క్రికెట్ అకాడమీ రిహాబిటేషన్‌లో గడుపుతున్న రోహిత్‌.. బాగా సన్నబడిపోయి, క్లీన్‌ షేవ్‌తో కనిపించాడు. న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోపై రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఓ ఫన్నీ కామెంట్ చేసింది. రితికా స్పందిస్తూ… ‘ఎందుకంత క్రూరంగా చూస్తున్నావ్..?’ అని రాసుకొచ్చింది.

భారత వన్డే జట్టుకి కొత్త కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత ఏడాది చివర్లో రోహిత్ శర్మ తొడ కండరాలకి గాయమవగా.. దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌కి అతను ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దాంతో.. టెస్టులతో పాటు వన్డే జట్టులోకీ ఎంపికవని రోహిత్ శర్మ ఇప్పుడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ సాధించే పనిలో బిజీగా ఉన్నాడు.

సాధారణంగా గడ్డం, చిన్నపాటి మీసాలతో కనిపించే రోహిత్ శర్మ.. తాజాగా గడ్డం, మీసాలని పూర్తిగా ట్రిమ్ చేసేశాడు. దాంతో.. హిట్‌మ్యాన్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారత్, శ్రీలంక మధ్య ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి రోహిత్ శర్మ వచ్చే అవకాశం ఉంది.

rohit sharma new look
rohit sharma new look

ఏదేమైన రోహిత్ శ‌ర్మ ఇంత షార్ట్ టైంలో ఇంత స్లిమ్‌గా మార‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్త చేస్తున్నారు. ఇక మైదానంలో రోహిత్ సునామి ఓ రేంజ్‌లో ఉండ‌డం ఖాయం అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.