Rohit Sharma : స‌రికొత్త లుక్‌లో రోహిత్ శ‌ర్మ‌.. ఫొటో షేర్ చేసిన శిఖ‌ర్ ధావ‌న్

Rohit Sharma : హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఇటీవ‌ల ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌కి కెప్టెన్‌గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్ వ‌చ్చిన‌ప్ప‌టికీ దానిని అనుభ‌వించే అదృష్టం హిట్‌మ్యాన్‌కు ఇప్ప‌ట్లో ద‌క్కేలా లేదు. దీనికి అత‌ని తొడ కండ‌రాల గాయ‌మే కార‌ణం. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ అనంత‌రం రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ అప్ప‌గించిన సెలెక్ట‌ర్లు.. త‌ర్వాత కొద్ది రోజుల‌కే వ‌న్డే కెప్టెన్సీ కూడా అప్ప‌గించారు. అంతేకాకుండా టెస్టుల‌కు వైస్ కెప్టెన్‌గా కూడా నియ‌మించారు.

Rohit Sharma new look goes viral
Rohit Sharma new look goes viral

రోహిత్ ఫిట్‌గా ఉంటే ఇప్పుడు కోహ్లీ గైర్హాజ‌రుతో టెస్ట్ జ‌ట్టుని కూడా ముందుండి న‌డిపించేవాడు. రోహిత్, కోహ్లీ లేని కార‌ణంగా సార‌ధ్య బాధ్య‌త‌ల‌ను రాహుల్ అందుకున్నాడు. అయితే రోహిత్ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో హిట్‌మ్యాన్‌ చికిత్స పొందుతున్నాడు.

ఫిట్‌నెస్‌ నిపుణుల పర్యవేక్షణలో ట్రెయినింగ్‌ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో బరువు తగ్గాల్సిందిగా శిక్షకులు అతడికి సూచించినట్లు సమాచారం. తద్వారా మోకాలిపై భారం తగ్గి త్వరగా కోలుకునేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. సుమారు 5-6 కిలోలు బరువు తగ్గాల్సిందిగా సూచించిన నేపథ్యంలో… రోహిత్‌ ఆ దిశగా వర్కౌట్లు చేస్తున్నట్లు సమాచారం

టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సంజూ శాంసన్‌ తదితరులు కూడా రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో రోహిత్‌తో పాటు ట్రెయినింగ్‌ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గబ్బర్‌.. తమ కెప్టెన్‌ రోహిత్‌, భువీతో ఉన్న ఫొటోను సోమవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్‌.. హిట్‌మ్యాన్‌ కాస్త సన్నబడినట్లు కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్‌కు దూరం కాగా…. ధావన్‌, భువీ శిక్షణ పూర్తైన తర్వాత వన్డే సిరీస్‌ నిమిత్తం సౌతాఫ్రికాకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా ప్ర‌స్తుతం ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య రెండో టెస్ట్ న‌డుస్తుంది. ఇక జనవరి 19 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.