Rohit sharma: ధోని, కోహ్లీ మాదిరిగానే రోహిత్.. క‌ప్పు తీసుకెళ్లి వాళ్ల‌కు ఇచ్చాడు..!

Rohit sharma: టీ 20 మ్యాచ్‌ల‌కు కెప్టెన్‌గా ఉండ‌న‌ని విరాట్ ప్ర‌క‌టించిన త‌ర్వాత రోహిత్ ఆ బాధ్య‌త‌లు అందుకున్నాడు. న్యూజిలాండ్ తో జ‌రిగిన టీ 20 సిరీస్‌కు రోహిత్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అద్భుతంగా నిర్వ‌ర్తించాడు. ఈ క్ర‌మంలొఓ ఇండియా న్యూజిలాండ్‌పై మూడు టీ 20లు గెలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివ‌రి మ్యాచ్‌లో ఇండియా 184 పరుగులు చేసింది.

rohit-sharma-gave-trophy-to-harshal-patel3
rohit-sharma-gave-trophy-to-harshal-patel3

మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ జట్టు.. మొదటనుండే విజయం వైపు అడుగులేసిందని స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 56 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో ఒక ప్లేయర్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే. టీ20 వరల్డ్ కప్‌లో నిరాశపరిచిన భారత జట్టు.. టీ20 సిరీస్‌లో దుమ్ము దులిపింది. వేరే జట్టులకు ఛాన్స్ ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

rohit-sharma-gave-trophy-to-harshal-patel2
rohit-sharma-gave-trophy-to-harshal-patel2

రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కడం అభిమానుల‌ సంతోషాన్ని డబుల్ చేస్తోంది. 2017లో శ్రీలంకను, 2018లో వెస్టిండీస్‌ను, ఇప్పుడు న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ధోనీ కెప్టెన్సీలో ఈ రికార్డ్ ఒక్కసారి దక్కితే.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రెండు టీ20ల్లో టీమిండియా ప్రత్యర్థులను వైట్ వాష్ చేసింది.

rohit-sharma-gave-trophy-to-harshal-patel1
rohit-sharma-gave-trophy-to-harshal-patel1

క‌ప్ అందుకున్న త‌ర్వాత రోహిత్ తీసుకెళ్లి కొత్త కుర్రాళ్లు వెంక‌టేష్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌కు అందించాడు. గ‌తంలోను ధోని, కోహ్లీ ఇలానే చేశారు. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా, టీ20 క్రికెట్‌లో రోహిత్‌ శర్మ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 50కుపైగా పరుగులు చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ నిలిచాడు

rohit-sharma-gave-trophy-to-harshal-patel
rohit-sharma-gave-trophy-to-harshal-patel