Rohit Sharma : ఫ్యాన్స్ కి పెద్ద గుడ్‌ న్యూస్ చెప్పిన టీం ఇండియా కెప్టెన్‌

NQ Staff - November 9, 2022 / 11:38 AM IST

Rohit Sharma : ఫ్యాన్స్ కి పెద్ద గుడ్‌ న్యూస్ చెప్పిన టీం ఇండియా కెప్టెన్‌

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సందర్భంగా గాయపడడంతో రేపు జరగబోతున్న సెమీస్‌ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన ఇంగ్లాండ్ టీం తో టీమిండియా తలబడాలి అంటే కచ్చితంగా రోహిత్ శర్మ అంటే అనుభవం ఆటగాడు జట్టులో ఉండాలి.

ఈ సమయంలో ఆయన గాయపడడం అభిమానులకు ఆందోళన కలిగించింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడకపోతే కచ్చితంగా ఇండియా కు నష్టం జరుగుతుంది అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో ఈ రోజు రోహిత్‌ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు జరగబోతున్న మ్యాచ్ కి తాను పూర్తి ఫీట్ గా ఉన్నానని.. చిన్న గాయం తప్ప మరేంలేదని, దాని నుండి తాను కోల్కుకున్నాను అని, రేపు మ్యాచ్ ఆడబోతున్నట్లుగా ప్రకటించాడు.

దాంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రోహిత్ శర్మ ఉంటేనే అన్ని విధాలుగా బాగుంటుందని.. అతడి బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీ కూడా అద్భుతంగా ఉంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. రేపటి మ్యాచ్లో కోహ్లీ మరియు రోహిత్ శర్మ విజృంభించి ఆడితే సునాయాసంగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కి దూసుకు వెళ్తామని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us