India v/s England: ఐదో టెస్ట్‌కు ముందు భార‌త్‌కు పెద్ద దెబ్బ‌.. గాయాల బారిన రోహిత్, పుజారా

India v/s England: ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. భార‌త్‌- ఇంగ్లండ్ మ‌ధ్య ఇప్ప‌టికే మూడు టెస్ట్‌లు పూర్తి కాగా, ప్ర‌స్తుతం నాలుగో టెస్ట్ న‌డుస్తుంది. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్భుత సెంచరీతో మెరిశాడు. 205 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌ర్‌ సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా రోహిత్‌ సిక్స్‌తో సెంచరీ సాధించడం విశేషం.

Rohit, Pujara nurse injuries as India field substitutes in India v/s England Match
Rohit, Pujara nurse injuries as India field substitutes in India v/s England Match

సెంచరీతో అదరగొట్టిన రోహిత్‌ 127 పరుగులు వద్ద ఓలీ రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో వోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పుజారా, రోహిత్‌ల 153 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. ఆ వెంటనే పుజారా(61) రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే వీరిద్దరు ఐదో టెస్ట్‌కి అందుబాటులో ఉండ‌డం అనుమానంగా మారింది.


రోహిత్ శర్మ మోకాళ్ల మీద, తొడల మీద బంతి బలంగా తాకింది. ఈ కారణంగా రోహిత్ తొడ కండరాలు ఎర్రగా కమిలిపోవడం స్పష్టంగా కనిపించింది. ఇక పుజారా కూడా సింగిల్స్ తీసే క్ర‌మంలో గాయ‌ప‌డ్డాడు. అత‌ని అరికాలు మ‌డ‌త‌ప‌డ‌డంతో ఫిజియో చికిత్స తర్వాత తిరిగి బ్యాటింగ్ కొనసాగించిన ఛతేశ్వర్ పూజారా… పెయిన్ కిల్లర్స్ వేసుకుని నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు.


గాయాల కారణంగా రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా ఫీల్డింగ్‌కి రాకపోవడంతో ఆ ఇద్దరి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్ చేశారు. అయితే ఐదో టెస్ట్ స‌మ‌యానికి వీరిద్ద‌రు కోలుకోక‌పోతే వారి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రోహిత్ శ‌ర్మ ,పుజారా లాంటి పెద్ద ప్లేయ‌ర్స్ మ్యాచ్‌కి దూర‌మైతే క‌ష్ట‌మే.


ఐపీఎల్ 2021 సీజన్ దగ్గరికి వస్తున్న సమయంలో రోహిత్ శర్మ గాయపడడంతో ఫేజ్ 2లో ‘హిట్ మ్యాన్’ పూర్తిగా అందుబాటులో ఉంటాడా? లేదా? అని భయపడుతున్నారు అభిమానులు. రానున్న రోజుల‌లో టీ 20 కూడా ఉండ‌నుంది. ఈ క్ర‌మంలో ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.