ఐపీఎల్ : రాబిన్ ఊతప్ప పెద్ద పొరపాటు

Admin - October 1, 2020 / 09:50 AM IST

ఐపీఎల్ : రాబిన్ ఊతప్ప పెద్ద పొరపాటు

కరోనా నేపథ్యంలో ఐపీఎల్ ఆలస్యంగా మొదలయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ స్వదేశంలో కాకుండా దుబాయ్ లో ఏర్పాటు చేసారు. ఇక కరోనా నియమ నిబంధనల మధ్య ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. ఐసీసీ పెట్టిన నిబంధనల్లో భాగంగా బాల్ పై మెరుపు కోసం ఉమ్మిని(సలైవా) రుద్దడాన్ని తాత్కాలికంగా నిషేధం చేసారు.అలాగే ఈ రూల్ అతిక్రమిస్తే శిక్షలు కూడా ఉంటాయని తెలిపింది. ఇదే క్రమంలో నిబంధన గురించి మర్చిపోయాడో, లేక లైట్ తీసుకున్నాడో తెలియదు కానీ.. బంతికి ఉమ్మి రాస్తూ చిక్కాడు రాబిన్ ఊతప్ప. నిన్న రాజస్థాన్‌, కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఇక ఈ మ్యాచ్ లో కోల్‌కతా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రాజస్థాన్‌ ఫీల్డర్‌ రాబిన్‌ ఉతప్ప బాల్ కు లాలాజలం రుద్దాడు. మూడవ ఓవర్‌ లో ఐదవ బంతికి సునీల్ నరైన్‌ క్యాచ్ ‌ను ఊతప్ప మిస్ చేసాడు. ఆ తరువాత బాల్ కు ఉమ్మి రుద్దుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతుంది. బంతికి ఫీల్డర్‌ ఉమ్మి రుద్దితే అంపైర్లు కలగజేసుకొంటారు. బాల్ ను శానిటైజ్ చేయిస్తారు. అయితే ఫస్ట్ టైమ్ ఫీల్డర్‌ కు నిబంధనలను వివరిస్తారు. అలాగే వరుసగా రెండు సార్లు చేస్తే వార్నింగ్ ఇస్తారు. ఆ తరువాత కూడా అలాగే వ్యవహరిస్తే శిక్షగా ప్రత్యర్థికి ఐదు పరుగులు అదనంగా ఇస్తారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us