TDP : టీడీపీకి గెలుపు ఆశలు లేనట్టే.. తాజా పరిస్థితితో క్లియర్

NQ Staff - November 21, 2023 / 08:05 PM IST

TDP : టీడీపీకి గెలుపు ఆశలు లేనట్టే.. తాజా పరిస్థితితో క్లియర్

TDP :

భారత్ లో ఎన్నికలంటేనే ఓ పెద్ద సెలబ్రేషన్స్.. ఎన్నికలకు ఏడాది ముందే సర్వేలు, నివేదిక గట్రా తయారుచేస్తారు. ఆరు నెలల ముందే వ్యూహాలు తయారుచేసుకుంటారు. ప్రస్తుతం ఎన్నికలంటేనే సర్వేలు, స్ట్రాటజీ టీం సపోర్ట్ తప్పనిసరిగా మారిపోయింది. ప్రశాంత్ కిషోర్ వీటికి ఆద్యుడిగా నిలిచాడు. గతంలో ఎన్నో పార్టీలకు అధికారం తెప్పించిన ఘనత ఆయనది. 2019 ఎన్నికల్లో వైసీపీకి స్ట్రాటజిస్టుగా పనిచేసి అధికారంలోకి రప్పించగలిగారు. అలాగే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు స్ట్రాటజిస్టుగా పనిచేస్తూ వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఏపీలో టీడీపీకి రాబిన్ శర్మ టీం స్ట్రాటజిస్టుగా పనిచేస్తోంది.

అయితే రాబిన్ శర్మ టీంకు ఏ స్ట్రాటజీ టీమ్ కు ఎదురుకాని సమన్య టీడీపీతో ఎదురవుతోందట. టీడీపీ అధిష్ఠానం వైఖరిపై ఆ టీం లీడర్ రాబిన్ శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నటు సమాచారం. రాబోయే ఎన్నికలకు గానూ టీడీపీ తరఫున పనిచేసేందుకు రూ.450 కోట్ల ప్యాకేజీకి ఒప్పందం కుదిరిందని, అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో తాము పనిచేస్తున్నట్టు రాబిన్ శర్మ టీం సభ్యులు చెప్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో లోతైన పరిశీలన, అభిప్రాయాలు సేకరించి పార్టీకి నివేదికలు అందిస్తున్నామని, కానీ అధిష్ఠానం వైపు నుంచి అందుకు తగ్గట్టు చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు.

తాము చెప్పినట్టు నడుచుకోకపోతే.. తాము సర్వేలు చేసి నివేదికలు సమర్పించినా ఏం ప్రయోజనముంటుందని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు టీడీపీ నాయకులు టికెట్ ఆశిస్తున్నారని, వాళ్లలో ప్రజల్లో పట్టున్న నాయకుల గురించి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నివేదికలు సమర్పిస్తున్నట్టు స్ట్రాటజీ టీం మెంబర్లు చెప్తున్నారు. కానీ అభ్యర్థుల ఎంపిక విషయానికొస్తే ప్రజాదరణ లేదని చెప్పిన నేతలకు, సామాజిక సమీకరణాల పేరుతో సీటు కట్టబెడుతున్నారని అంటున్నారు. దీంతో తమ శ్రమంతా బూడిదలో పోసినట్టేనని ఆవేదన వ్య్తక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలు టీడీపీకి చావోరేవో అని, అలాంటిది ప్రతీ అభ్యర్థి ఎంపిక కీలకమని సూచిస్తున్నాయి.

ఒక పార్టీ విజయానికి అభ్యర్థి ఎంపికే కీలకం. సరైన అభ్యర్థిని ఎంపిక చేసినప్పుడే విజయం సాధ్యం. అయితే ఈ విషయంలో మేం సర్వేలో చెప్పిన విషయాలు పట్టించుకోకుంటే.. ఇక మాకు సర్వే బాధ్యతలు ఎందుకు అప్పజెప్పినట్టు అని టీం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదిరిందని, దీంతో లాభం కంటే ఎక్కువ నష్టమేనని టీం సభ్యులు సూచిస్తున్నారు. జనసేన, టీడీపీ ఓట్ల బదిలీ ఏమోగాని పరస్పరం వెన్నుపోటు పొడుచుకునేందుకు ఇరు పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారని రాబిన్ శర్మ టీం వెల్లడించింది.

తమ సర్వేలు, నివేదికలు పట్టించుకోకుండా టీడీపీ స్వీయ తప్పిదాలు చేస్తే.. ఆ పార్టీ కొంప మునిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. కోట్లాది రూపాయలు తమకు కట్టబెట్టి చివరకు ఓడిపోతే ఆ నింద తమపై వేసే అవకాశం ఉందని రాబిన్ శర్మ టీం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గతంలో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు జగన్ నిర్ణయాలు తీసుకోవడం వల్లే పాజిటివ్ ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. టీడీపీలో అలాంటి పరిస్థితి లేదని, గెలుపుపై గ్యారెంటీ ఇవ్వలేమని, తమపై నింద వేయవద్దని టీడీపీకి రాబిన్ శర్మ టీం సభ్యులు సూచిస్తున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us