Unstoppable Season2 : అప్పుడు వెళ్లాలి అనుకున్నాను కానీ.. రోజా షాకింగ్ వ్యాఖ్యలు
NQ Staff - January 18, 2023 / 10:13 AM IST

Unstoppable Season2 : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొనబోతున్నారు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆహా వారు నిజంగానే ఆ సమయంలో మంత్రి రోజాను సంప్రదించడం జరిగింది అంటూ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.
రోజా కూడా ఆసక్తిగా ఉన్నా కూడా ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమయంలో ఇలాంటి కార్యక్రమాలకు హాజరవ్వడం సరైన పద్ధతి కాదని తర్వాత సమయంలో ఎప్పుడైనా ఖచ్చితంగా షో కి హాజరవుతానంటూ రోజా ఆహా వారికి హామీ ఇచ్చారట.
ఎప్పుడైతే ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు హాజరై ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడారో అప్పుడే ఆ కార్యక్రమం పై తనకున్న అభిప్రాయం మారిపోయిందని.. అందుకే వెళ్ళను అంటూ తేల్చి చెప్పింది. బాలకృష్ణతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ ఇప్పుడు రాజకీయంగా చాలా దూరం పెరిగి పోయింది.
అందుకే బాలకృష్ణ పిలిచిన కూడా తాను ఆ కార్యక్రమానికి వెళ్ళను అంటూ రోజా పేర్కొన్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడుతూ గతంలో అన్ స్టాపబుల్ టాక్ షో కు వెళ్లాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం ఆ ఆలోచన తనకు లేదని కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానించిన కూడా ఆసక్తి చూపించనని పేర్కొంది.
చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమానికి హాజరవ్వడం వల్లే రోజా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా ఆమె మాటల ద్వారా అర్థమవుతుంది. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజా ముందు ముందు సీజన్లలో ఏమైనా కనిపించబోతుందేమో చూడాలి.