RK Roja YSRCP New Slogan : హాయ్‌ ఏపీ.. బైబై బీపీ

NQ Staff - June 24, 2023 / 08:56 PM IST

RK Roja YSRCP New Slogan : హాయ్‌ ఏపీ.. బైబై బీపీ

RK Roja YSRCP New Slogan  : జనసేన పార్టీ అధినేత హాయ్ ఏపీ.. బైబై వైసీపీ అంటూ వారాహి యాత్రలో చేసిన నినాదంకు కౌంటర్ గా వైకాపా కొత్త నినాదంను తీసుకు వచ్చింది. తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ హాయ్ ఏపీ.. బైబై బీపీ(బాబు, పవన్‌) అనే కొత్త నినాదాన్ని తీసుకు వచ్చింది.

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ కనీసం తన పార్టీ గుర్తును కూడా కాపాడుకోలేక పోయాడు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ గుర్తుతో పోటీ చేస్తాడు అనే విషయంలో స్పష్టత లేదు. అలాంటి పవన్ కళ్యాణ్ ను జనాలు ఎలా నమ్ముతారు అంటూ రోజా కౌంటర్ ఇచ్చారు.

స్లోగన్స్‌ నుండి మేనిఫెస్టో వరకు అన్నింటిని కూడా చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ లు కాపీ కొడుతున్నారని.. బుర్ర పెట్టి కొత్తగా ఆలోచించే శక్తి కూడా వీరికి లేదా అంటూ రోజా ఎద్దేవ చేశారు. పవన్‌ కళ్యాణ్ కు అన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షులే లేరు. అలాంటిది 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కడి నుండి వస్తారు అంటూ ఆమె ప్రశ్నించారు.

పార్టీని కాపాడుకునే శక్తి లేదు… కనీపం పార్టీ గుర్తును నిలుపుకునే సత్తా లేని వ్యక్తికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం నుండి తరిమేస్తానంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని రోజా అన్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us