Rishabh Pant : రిషబ్ పంత్ మళ్ళీ క్రికెట్ ఆగడగలడా.?
NQ Staff - December 31, 2022 / 10:04 AM IST

Rishabh Pant : టీమిండియా డాషింగ్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ నిన్న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్ర గాయాల పాలయ్యాడు కూడా. కాలిన గాయాలతోపాటు, నుదుటిపైన గాయమైంది.. దానికి కుట్లు వేశారు.
మరోపక్క, మోచేతికి, మోకాలికి సైతం గాయాలయ్యాయనీ, ఫ్రాక్చర్ కూడా అయ్యిందని వైద్యులు తెలిపారు. అంతర్గత అవయవాలకు గాయాలేమైనా అయ్యాయా.? అన్నదానిపై రకరకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రాణాపాయం లేదు గానీ..
ప్రాణాపాయమైతే తప్పింది రిషబ్ పంత్‌కి. అయితే, తీవ్ర గాయాలు కావడంతో, కోలుకోవడానికి చాలా చాలా సమయం పట్టొచ్చన్నది వైద్య నిపుణులు చెబుతున్నమాట. ఈ విషయమై బీసీసీఐ కూడా వైద్యుల నివేదిక నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేసింది.
విషమ పరిస్థితి కాదనీ, అయితే గాయాలు మాత్రం కొంత గట్టిగానే తగిలాయనీ బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. క్రికెట్‌లో ఫిట్నెస్‌కి ప్రాధాన్యత చాలా చాలా ఎక్కువ. గాయం నుంచి కోలుకున్నా.. ఫిట్నెస్ సంపాదించడానికి చాలా చాలా కష్టపడాల్సి వుంటుంది.
ఫ్రాక్చర్లు.. అందునా వికెట్ కీపర్‌కి ఫ్రాక్చర్లు అంటే చిన్న విషయం కాదు. వికెట్ల వెనుకాల మెరుపులా దూకాల్సి వుంటుంది.
సో, సమీప భవిష్యత్తులో రిషబ్ పంత్ క్రికెట్ ఆడటం కష్టమే కావొచ్చు.