Rishabh Pant : రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ కి తీవ్ర గాయాలు
NQ Staff - December 30, 2022 / 10:17 AM IST

Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. దాంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. కారును స్వయంగా రిషబ్ పంత్ నడుపుతున్నాడు. అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీ కొట్టడంతో ఫల్టీలు కొట్టిందని.. ఆ సమయంలోనే పంత్ బయటకి దూకేశాడట.
కారు పూర్తిగా దగ్ధమైంది. కారు విజువల్స్ చూస్తే రిషబ్ పంత్ బతికే ఉన్నాడా అన్నంత అనుమానం కలుగుతుంది. పంత్ తల, మోకాలి గాయాలతో స్థానిక హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. రూర్కీ స్థానిక ఆసుపత్రి లో ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించబడ్డాడు.
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. సీనియర్ క్రికెటర్లు తోటి క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆయన ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆడిన విషయం తెలిసిందే. క్రిస్మస్ వేడుకలకు ఇటీవల మాజీ కెప్టెన్ ధోనితో కలిసి దుబాయ్ వెళ్లి వచ్చాడు, ఇంతలోనే ఇది జరిగింది.