Rishabh Pant : రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం: క్రికెటర్‌కి నాలుగు వేలు తిరిగిచ్చిన యువకులు.!
NQ Staff - January 3, 2023 / 12:08 PM IST

Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవల ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఫేస్ మీద గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. కాలికి గాయం కాస్త ఎక్కువ కావడంతో, చిన్నపాటి సర్జరీ చేశారు.
వీపు భాగంలో కాలిపోగా, అది నయమయ్యేందుకూ తగిన వైద్య చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇదిలా వుంటే, ఆ రోజు కారు ప్రమాదం సమయంలో ఇద్దరు యువకులు, రిషబ్ పంత్కి చెందిన నాలుగు వేల రూపాయల నగదుని తీసుకున్నారు.
దొంగిలించారన్నారుగానీ.. దొంగతనం కాదది..
రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైతే అటుగా వెళుతున్న ఇద్దరు యువకులు ఆ కారులోంచి డబ్బు వున్న బ్యాగ్ దొంగిలించారంటూ ప్రచారం జరిగింది. అయితే, అదంతా ఉత్తదేనని తేలింది. ఇద్దరు యువకులు తాము భద్రపరిచిన నాలుగు వేల రూపాయల నగదుని, తాజాగా క్రికెటర్ రిషబ్ పంత్కి అప్పగించారు.
రిషబ్ పంత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్ళి అతన్ని పరామర్శించి, నగదుని అందజేశారు. ఈ ఇద్దరు యువకులతోపాటు, బస్ డ్రైవర్, కండక్టర్ కూడా రిషబ్ పంత్‌ని కాపాడారు. ఆ యువకుల పేర్లు రజత్ కుమార్, నిషు కుమార్.