MM Keeravani : ఆస్కార్ అందుకున్నప్పుడు రాని కన్నీళ్లు, ఆయన శుభాకాంక్షలు చెబితే వచ్చాయట
NQ Staff - March 16, 2023 / 07:30 PM IST

MM Keeravani : నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి అంతర్జాతీయ స్థాయి లెజెండ్రీ గాయకుడు, సంగీత దర్శకుడు రిచర్డ్ కార్పెంటర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా కీరవాణి స్టేజ్ పై మాట్లాడుతూ కార్పెంటర్ పాటలు వింటూ పెరిగానని.. ఈ స్థాయిలో నిలబడి ఆస్కార్ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
తాను ఎంతగానో అభిమానించే రిచర్డ్ కార్పెంటర్ సోషల్ మీడియా ద్వారా కీరవాణికి మరియు గీత రచయిత చంద్రబోస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పాటను కూడా పాడారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆస్కార్ అవార్డు అందుకున్న సమయంలో కూడా కన్నీళ్లు పెట్టుకొని కీరవాణి ఎప్పుడైతే కార్పెంటర్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పిన సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మీ అభినందనలతో అన్నయ్య కీరవాణి కళ్లలో నీళ్లు వచ్చాయి. ఇన్నాళ్ల జర్నీలో ఆయన కన్నీళ్లు చూడటం ఇదే ప్రథమం అని రాజమౌళి అన్నారు.