Richa Chadha : క్షమాపణ చెప్పినా ఆమెపై ఆగని విమర్శలు

NQ Staff - November 25, 2022 / 02:55 PM IST

Richa Chadha : క్షమాపణ చెప్పినా ఆమెపై ఆగని విమర్శలు

Richa Chadha : పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఏ క్షణంలోనైనా స్వాధీనం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇండియన్ ఆర్మీ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి రిచా చద్దా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే.

తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమాపణ చెబుతున్నాను అంటూ వెంటనే తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఇండియన్ ఆర్మీ విషయంలో అలాంటి కామెంట్స్ అస్సలు సరి కాదంటూ విమర్శలు గుర్తిస్తున్నారు.

దేశ రక్షణలో భాగస్వామ్యం అవుతున్న వారి పట్ల అవహేళనగా మాట్లాడితే కచ్చితంగా అది దేశాన్ని అవహేళన చేసినట్లే అవుతుందని పలువురు ప్రముఖులు ఆమె వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Richa Chadha Controversial Comments On Comments By Indian Army

Richa Chadha Controversial Comments On Comments By Indian Army

తాజాగా మంచు విష్ణు ఈ విషయమై స్పందిస్తూ.. ఆమెకు ఏమైంది, అసలు ఈ విధంగా ఎవరైనా ఆలోచిస్తారా.. సైనికులను మనం గౌరవించాలి కృతజ్ఞత భావం చూపించాలి. ఆమె కామెంట్స్ సైనికులను వారి కుటుంబ సభ్యులను బాధించే విధంగా ఉందని పేర్కొన్నాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. సైనిక దళాల పట్ల మనం కృతజ్ఞతలు చూపించాలి. అంతే తప్ప కృతజ్ఞత లేని వారిగా మారకూడదు అన్నట్లుగా పేర్కొన్నాడు. ఇప్పటికే ఆమె పై పోలీసు కేసు కూడా నమోదు అయింది.

ఈ నేపద్యంలో రిచా మరిన్ని ఇబ్బందులు ఆమె ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతూ ఉన్నారు. కొందరు మాత్రం ఆమె క్షమాపణ చెప్పిన కూడా ఇంకా రాద్ధాంతం అవసరమా అంటూ ఆమెపై సానుభూతి తెలిపేలా కామెంట్స్ చేస్తున్నారు. మరో సారి ఆమె మీడియా ముందు కు వచ్చి క్షమాపణలు చెబుతుందేమో చూడాలి.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us