శభాష్ ఇండియా … ఒక కుటుంబాన్ని నాశనం చేసావు: రియా తండ్రి

Advertisement

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి రోజుకో మలుపు తిరుతున్న నేపథ్యంలో రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. “శభాష్ ఇండియా…నా కొడుకును అరెస్ట్ చేసి నా కుటుంబాన్ని నాశనం చేశావ్. తరువాత అరెస్ట్ అయ్యేది నా కూతురేననే విషయం నాకు అర్ధమవుతుంది. వీరిద్దరి తరువాత ఇంకెవరిని అరెస్ట్ చేస్తారో నాకు తెలియదు” అంటూ తన ఆవేదనను మీడియా ముందు వెళ్లబుచ్చుకున్నారు.

సుశాంత్ సింగ్ మృతిపై సీబీఐ అధికారులు విచారణ చేస్తుండగా డ్రగ్స్ కోణం బయటపడటం వల్ల ఎన్‌సీబీ రంగంలోకి దిగి, దర్యాప్తు చేపట్టింది. దీంతో ఎన్‌సీబీ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి తదితరులపై కేసు నమోదు చేసి ఆగస్టు 27న దర్యాప్తు ప్రారంభించింది. రెండు రోజుల క్రితం షోవిక్‌ చక్రవర్తిని అరెస్టు చేసింది. ఆదివారం ఉదయం రియాకు సమన్లు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరోపక్క ఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here