సీబీఐ ఎంక్వైరీకి హాజరైన రియా చక్రవర్తి

Advertisement

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి రోజుకో మలుపు తిరుగుతుంది. సుశాంత్ సింగ్ మరణించినప్పటి నుండి దేశంలో ఈ విషయంపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సుశాంత్ కి సంబంధించిన ఎదో ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు సీబీఐ సుశాంత్ కేసును విచారిస్తుంది. ఈరోజు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తి సీబీఐ ఎంక్వైరీకి హాజరయ్యారు.

గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో రియాకు మద్దతు పెరుగుతూ వస్తుంది. సుశాంత్ సింగ్ విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండానే రియాను దోషిగా మీడియా సంస్థలే నిర్ణయిస్తున్నాయని ప్రముఖులు చెప్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా రియాను సమర్థిస్తూ మీడియాను తప్పు పట్టారు. సీబీఐ కంటే కూడా మీడియానే ముందుగా విచారణ చేస్తుందని, అది కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here