బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్ట్

Advertisement

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ పోలీసులు ఈరోజు ముంబైలో రియా చక్రవర్తి ని అరెస్టు చేశారు. అయితే ఎన్ ‌డీపీఎస్ లో వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అరెస్టు చేసిన తరువాత డ్రగ్స్ రికవరీ కోసం ఆమెను వివిధ ప్రాంతాలకు ఎన్‌సీబీ అధికారులు తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ పోలీసులు ఈ కేసులో 8 మంది ప్రముఖులను అరెస్టు చేశారు.

రియా చక్రవర్తి సోదరుడు శౌవిక్ ‌తో పాటు సుశాంత్ సింగ్ ఇంటి మేనేజర్ సామ్యూల్ కూడా ఎన్‌సీబీ ఆధీనంలో ఉన్నారు. ఇక డ్రగ్స్ కు సంబందించిన కేసులో గత మూడు రోజుల నుండి రియాను ఎన్‌సీబీ విచారణ చేపట్టింది. అయితే రియాకు వైద్య పరీక్షలు చేయనున్నారు. ఆ తరువాత ఆమెను మరింత లోతుగా విచారించనున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here