సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసిన రియా చక్రవర్తి

Advertisement

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి పేరు ఎక్కువగా వినబడుతుంది. సుశాంత్ అకౌంట్ నుండి రియా అకౌంట్ లోకి 15 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు తేలుస్తోంది. దీనితో రియా చక్రవర్తి పాత్రకు సంబంధించి ఆమె పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. అలాగే ఆమె పై సీబీఐ విచారణ కూడా జరుపుతోంది. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి సోమవారం సుప్రీం లో మరో పిటిషన్‌ను దాఖలు చేసింది.

అయితే ఈ కేసులో బీహార్ పోలీసుల విచారణను తప్పుబడుతూ.. రియా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా రియా మీడియా వైఖరిపై పిటిషన్ దాఖలు చేసింది. రియా వేసిన పిటిషన్ లో.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మీడియా తనను అన్యాయంగా నేరస్తురాలిగా చిత్రీకరిస్తోందని ఆరోపించింది. సీబీఐ విచారణకు సుప్రీం కోర్ట్ ఆదేశిస్తే తనకు అభ్యంతరం లేదని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. అలాగే ఈ కేసు ముంబై పరిధిలో ఉందని, బీహార్ పరిధిలో కాదని ఆమె పిటిషన్‌లో తెలిపింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here