అల్లు అరవింద్ పై ఆర్జీవీ మూవీ తీయనున్నాడా? ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన ఆర్జీవి

Advertisement

ఈ కరోనా కష్ట కాలంలో దాదాపు అన్ని కంపెనీలు మూత పడ్డాయి. కానీ ఈ కష్టకాలంలో కూడా దర్శకుడు ఆర్జీవీ కంపెనీ మాత్రం రెట్టించిన ఉత్సహంతో పనిచేస్తుంది. ఈ లాక్ డౌన్ మొదలైన తరువాత అర్జీవీ క్లైమాక్స్, ఎన్ఎన్ఎన్, పవర్ స్టార్ అనే మూవీస్ ని తన ఆన్లైన్ థియేటర్ అయిన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో పేపర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేశాడు. ఈ మూడింటికి పెట్టినదానికంటే ఎక్కువ లాభలనే అర్జీవీ సంపాదించారు. ఆలాగే ఇప్పుడు మర్డర్, థ్రిల్లర్, 12’O క్లాక్ లాంటి మూవీస్ కూడా రిలీజ్ కు రెడిగా ఉన్నాయి.
అయితే తాజాగా అర్జీవీ తీసిన పవర్ స్టార్ మూవీతో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన అర్జీవీ ఇప్పుడు అల్లు అరవింద్ పై కూడా ఒక మూవీ తీయనున్నాడని, దానికి “ప్రజారాజ్యంలో బావరాజ్యం” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని ఫిల్మ్ వర్గాలు చర్చుకుంటున్నాయి. అయితే ఈ వార్త పై స్పందించిన అర్జీవీ అలాంటి మూవీ తీయడం లేదని, తాను తీసే సినిమాలకు సంబంధించిన విషయాలను తానే వెల్లడిస్తానని, ఇలాంటి రూమర్స్ ను నమ్మవద్దని అర్జీవీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here