RGV satires on Pawan : ఆర్జీవీకి దొరికిపోయిన పవన్.. ఆడేసుకుంటున్న వర్మ..!

NQ Staff - September 11, 2023 / 01:32 PM IST

RGV satires on Pawan : ఆర్జీవీకి దొరికిపోయిన పవన్.. ఆడేసుకుంటున్న వర్మ..!

RGV satires on Pawan : పోయి పోయి ఆర్జీవీకి తిట్టడానికి అవకాశం ఇస్తే ఊరుకుంటాడా.. పులిముందుకు వెళ్లి కుప్పిగంతులేసినట్టే ఉంటుంది. ఇప్పుడు పవన్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. ఆర్జీవీని తీవ్రంగా వ్యతిరేకించే పవన్.. ఇప్పుడు ఆయనకే దొరికిపోయాడు. దాంతో వర్మ ఆడేసుకుంటున్నాడు. యాధృచ్చికంగా దొరికాడా.. లేదంటే కావాలని దొరికాడో అర్థం కావట్లేదు గానీ.. సందర్భానికి సింక్ అయ్యేలా పవన్ వ్యవహరించిన తీరుతో ఆర్జీవీ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. పవన్ మీద సెటైర్లు వేసేసి పిచ్చి లేపుతున్నాడు. చంద్రబాబు అరెస్ట్ కావడంతో పవన్ పడుతున్న హైరానా అంతా ఇంతా కాదు.

అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన రోజున పవన్ స్వయంగా విజయవాడకు వెళ్లాడు. రోడ్డు మీదుగా వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పవన్ రెచ్చిపోయాడు. కారు దిగి రోడ్డు మీద అడ్డంగా పడుకున్నాడు. అంతే కాకుండా రోడ్డు మీద కూర్చుని కెమెరాలకు ఫోజులిచ్చాడు. అయితే ఈ ఫోజులను పట్టుకున్న ఆర్జీవీ.. తాను తీస్తున్న వ్యూహం సినిమాలో పాత్రదారి మేనరిజానికి సింక్ చేశాడు. పవన్ కల్యాణ్‌ మెంటాలిటీని తనకంటే బాగా ఎవరూ పట్టుకోలేరని చెబుతున్నాడు. ఆయన చెబుతోంది కూడా నిజమే నండోయ్. ఎందుకంటే నెల కిందట ఆయన వ్యూహం సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇందులో పవన్ పాత్రదారి నేల మీద పడుకున్న విధానం, అలాగే కూర్చున్న విధానం మొన్న రోడ్డు మీద పవన్ కల్యాణ్ పడుకుని, కూర్చుని ఇచ్చిన ఫోజులకు సరిగ్గా సరిపోయాయి. అసలు పవన్ ఆ సినిమాలో పాత్రకు సరిపోయినట్టుగా ఇలా ప్రవర్తించడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. వర్మ సినిమాలో ఆ పాత్రదారి చేసిన ఫోజులను.. నిజ జీవితంలో పవన్ కల్యాణ్‌ అవలంబించడం ఇక్కడ విశేషం. మరి ఆ వ్యూహం సినిమా ట్రైలర్ ను చూసి పవన్ ఇలా చేశాడా.. లేక చూడకుండానే చేశాడా అనేది అర్థం కావట్లేదు. కానీ పవన్ మెంటాలిటీని ఆర్జీవీ బాగానే పట్టుకున్నాడని కామెంట్లు వస్తున్నాయి.

దాంతో సోషల్ మీడియాలో ఆర్జీవీ పంచ్ రూపంలో ట్వీట్ చేశాడు. పైగా చంద్రబాబుపై కూడా మరో సెటైర్ పేల్చాడు. చంద్రబాబు పెళ్లి అనే జైలు జీవితం నుంచి నిజమైన జైలు జీవితంలోకి వెళ్లారు. పైగా ఆయన పెళ్లి రోజునే ఇలా జరగడం విధిరాత అంటూ కొటేషన్ జోడించాడు వర్మ. ఇంకేముంది ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ అయిపోయింది. ఎంతైనా టైమ్ చూసి దిమ్మతిరిగే పంచ్ వేయడంలో ఆర్జీవీ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవాలి.

ఇప్పుడు దొరికిందే సందు అన్నట్టు పవన్ ను ఆడేసుకుంటున్నాడు ఆర్జీవీ. పోయి పోయి ఆర్జీవీకి దొరికిపోవడం అంటే ఇదే అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మామూలుగానే పంచ్ లు వేసే ఆర్జీవీ.. తనకు స్టఫ్‌ ఇస్తే ఊరుకుంటాడా.. ఏదేమైనా పవన్ చేస్తున్న హైరానాపై ఆర్జీవీ ఇలా కౌంటర్ వేశాడన్నమాట.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us