మర్డర్ మూవీ నుండి పాటను విడుదల చేసిన దర్శకుడు ఆర్జీవి

Advertisement

ఇండియన్ మూవీ ప్రేక్షకులకు కొత్త తరహా కథలను పరిచయం చేసి, ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆల్టర్ నేటివ్ రియాలిటీ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు చేస్తున్నారు. అలాగే కొన్ని నిజ సంఘటనల ఆధారంగా కూడా కొన్ని మూవీస్ తీస్తూ, వాటిని తన ఆన్లైన్ థియేటర్ అయిన ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో పేపర్ వ్యూ కాన్సెప్ట్ తో రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా అమృత ప్రణయ్ సంఘటన ఆధారంగా మర్డర్ అనే మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక పాటను ఇవ్వాళ విడుదల చేశారు. పిల్లను ప్రేమించడం తప్పా అంటూ సాగే పాటను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఈ మూవీని ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీపై ఇప్పటికే ప్రణయ్ తండ్రి అర్జీవీ పై కేసు వేసిన విషయం తెలిసిందే. ప్రతి మూవీ ఎదో ఒక వివాదం సృష్టించే ఆర్జీవి ఈ మూవీతో ఎలాంటి వివాదాలు ఎదుర్కొనబోతున్నాడో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here