రోజురోజుకు దిగజారుతున్న మీడియా: ఆర్జీవీ

Advertisement

దర్శకుడు రాం గోపాల్ వర్మ తన మూవీస్ తోనే కాదు తన ట్వీట్స్ తో కూడా జనాలను ఎంటర్ టైన్ చేస్తారు. ఆయన చేసే ట్వీట్స్ కొందరికి ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటే ఇంకొంతమందికి కోపాన్ని తెప్పిస్తాయి. అయితే ఆర్జీవీ గత కొన్ని రోజులుగా మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై మీడియా హద్దులుదాటి ప్రవర్తిస్తుందని, నిజానిజాలు తెలుసుకోకుండా వాళ్లకు ఇష్టమొచ్చిన వారిని దోషులుగా చిత్రీకరిస్తున్నారని, మీడియా వల్ల అమాయకులు దోషులుగా ఎంచబడుతున్నారని వెల్లడించారు.

దేశంలో ఇప్పుడు రెండు ప్యాండమిక్స్ ఉన్నాయని, వాటిలో ఒకటి కరోనా కాగా, రెండవది ఎకనామిక్ ప్యాండమిక్ తో ఇబ్బందుల్లో ఉందని, వాటి పై కథనాలు ప్రచారం చేయాలని మీడియాకు ఆర్జీవీ సలహా ఇచ్చారు. గత కొంత కాలం నుండి మీడియా స్థాయి రోజురోజుకు దిగజరుతుందని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here