ఆర్జీవీ సినిమాలు మానేసి బి గ్రేడ్ మూవీస్ తీసుకోవడం మంచిది…

Advertisement

ఆర్జీవీ బి గ్రేడ్ మూవీస్ మాత్రమే తీయబోతున్నాడు …. ప్రేక్షకులని తనకు దగ్గర చేసిన తన పాత కథల్లాంటి సినిమాలు ఇక రావు . ఆర్జీవీ కి నిజంగా సినిమాలు తీయడం మీద ఆసక్తి పోయింది .. ఇవన్నీ గతం లో ఆర్జీవీ పైన వచ్చినటువంటి వార్తలు అయితే ప్రస్తుతం ఆయన తీస్తున్న సినిమాలను చూస్తుంటే అదంతా నిజమే అనిపిస్తుంది . అయితే ఆర్జీవీ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలను అనౌన్స్ చేయడమే కాకుండా ఆ సినిమాలను త్వర త్వరగా షూటింగ్ లు పూర్తి చేసి ఓటిటి ద్వారా ప్రేక్షకులకు అందిస్తున్నాడు .

ఇలా లాక్ డౌన్ కాలం లో అందరి కంటే భిన్నంగా అలోచించి కనీసం ఒటిటి లో నైనా సినిమాలను అందిస్తున్నాడు. అనుకున్న అతని అభిమానులకు మరియు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది . ఇప్పటి వరకు ఆలా విడుదల చేసిన రెండు సినిమాల్లో కూడా కేవలం బోల్డ్ కంటెంట్ కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు .. బోల్డ్ కంటెంట్ లో అయినా ఆర్జీవీ మార్క్ ఎక్కడైనా కనిపిస్తుందా అనుకున్న వారికి ఆ సినిమాలు అసలు ఎందుకు చెసాడురా బాబు అన్న భావనని కలిగించాయి .

మొదటి గా విడుదల అయిన క్లైమాక్స్ సినిమా చూసిన వారు అందరూ కూడా ఆ సినిమాలో ఆర్జీవీ చెప్పిన విషయాలు , అతని ఇంటెన్షన్ కానీ ఏది కూడా అంత బాగాలేదు అంటూ తేల్చి చెప్పేసారు . సరే ఆ తరువాత పలు భాషల్లో విడుదల అయిన నేకేడ్ సినిమా అయినా అంచనాలను అందుకుంటుందా అనుకున్న ప్రేక్షకులకు ఆ సినిమా అస్సలు ఎంత మాత్రము నచ్చలేదు….

ఇంకా నేకేడ్ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే అసలు ఆ సినిమాకు ఒక మూలం కానీ ముఖ్యమైన అంశాలు కానీ లేవు . అనే చెప్పాలి .. ఈ సినిమా మొత్తం చీప్ యాక్ట్స్ తో మరియు వైల్డ్ కెమెరా యాంగిల్ ల తోనే కొనసాగుతూ వెళుతుంది . ఆర్జీవీ అసలు తన విలువైన సమయాన్ని మరియు డబ్బుని ఖర్చు చేసి అసలు ఏమి కథ లేని ఒక సినిమా ని తెరకెక్కించాడు అనే చెప్పాలి … దీనంతటికి బదులుగా ఆ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పనికి రాని శృంగార భరిత చిత్రం గా చెప్పేయొచ్చు .

ఆర్జీవీ సినిమాలు ఎలా కొనసాగుతున్నప్పటికీ అతని మాటలు మరియు అతడు మనుషుల్ని మానుపులేట్ చేసే తీరు మాత్రం అతని సినిమాలలో ఏదో ఉంది తప్పకుండా చూడాలి అన్న ఆసక్తి అయితే కలిగేలా చేస్తుంది . ఆలా తన ఇంస్టాగ్రామ్ మరియు ట్విట్టర్ వేదికగా కేవలం అరగంట లోనే ఇంత మొత్తం లో వ్యూస్ వచ్చాయి. అని పోస్ట్ ద్వారా తెలియ చేయడం తో నిజంగా సినిమా అంతలా నచ్చుతుందా అందరికి అన్న ఒక ఇంటెన్షన్ ని క్రియేట్ చేసాడు. కానీ నిజంగా ఆ సినిమాని ఎంత మంది చూసారో అనేది ఆ దేవుడికే కాదు కాదు ఆర్జీవీ కె తెలియాలి

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here