‘అర్ణబ్’ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్న ఆర్జీవీ
Admin - August 12, 2020 / 12:02 PM IST

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిజజీవితాల ఆధారంగా మూవీస్ తీస్తూ ఉంటారు. ఈ లాక్ డౌన్ సమయంలో కూడా ఆర్జీవీ ఖాళీగా ఉండకుండా నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. తన ఆన్లైన్ థియేటర్ లో మూవీస్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మిస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాలను తీశారు. ఇప్పుడు రిపబ్లిక్ న్యూస్ ఛానల్ లో పని చేసే అర్ణబ్ గోస్వామి పై మూవీ తీయనున్నారు. ఈ మూవీకి ‘అర్ణబ్’ ద న్యూస్ ప్రాస్టిట్యూట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
అయితే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవ్వాళ రాత్రి 8:51 నిమిషాలకు విడుదల చేయనున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మూవీ లో అర్ణబ్ గోస్వామి మీడియా ముసుగులో చేస్తున్న మోసాలను ప్రజలకు చూపిస్తానని వర్మ తెలిపారు. బాలీవుడ్ పై అర్ణబ్ చేసిన వ్యాఖ్యలకు హర్ట్ అయిన ఆర్జీవీ ఈ మూవీ తీయడానికి పూనుకున్నారు.