అర్ణబ్ గోస్వామిపై మూవీ తీయనున్న ఆర్జీవి

Advertisement

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ మరో వివాదాస్పదమైన చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ తీసి తన ప్రతిభను దేశం మొత్తం చాటుకున్న దర్శకుడు ఆర్జీవి ఇప్పుడు ఆల్టర్ నేటివ్ రియాలిటీ కాన్సెప్ట్స్ తో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు జీవితలపై మూవీస్ తీస్తున్నారు. అలాగే ఆర్జీవివరల్డ్ థియేటర్ అనే ఆన్లైన్ థియేటర్ ను ప్రారంభించి హార్డ్ హిట్టింగ్ ఫిలిమ్స్ తీసుస్తున్నాడు. ఇప్పటి వరకు ఆర్జీవివరల్డ్ థియేటర్ లో క్లైమాక్స్, ఎన్ఎన్ఎన్, పవర్ స్టార్ అనే మూవీస్ ని పే పర్ వ్యూ అనే కాన్సెప్ట్ తో రిలీజ్ చేశారు.
అయితే ఇప్పుడు రాంగోపాల్ వర్మ న్యూస్ యాంకర్ అయిన అర్ణబ్ గోస్వామిపై ఒక మూవీ తీయబోతున్నానని, దానికి అర్ణబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనక బాలీవుడ్ బడా నిర్మాతలు, దర్శకుల కుట్ర దాగుందని అర్ణబ్ మొదటి నుండి రిపబ్లిక్ టీవీలో డిబేట్స్ కండక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒక డిబేట్ లో అర్ణబ్ మాట్లాడుతూ… ఇండస్ట్రీలో రేపిస్ట్ లు, క్రిమినల్స్, మోసం చేసేవాళ్ళు, అండర్ వరల్డ్ తో సంబంధం కలిగిన వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు ఆర్జీవి స్పందిస్తూ…బాలీవుడ్ లో ఉన్న సీక్రెట్స్ గురించి అర్ణబ్ చెప్తున్నాడు కాబట్టి కాబట్టి మీడియాలో అర్ణబ్ చేస్తున్న మోసాలను నేను చూపిస్తానని ఆర్జీవి ప్రకటించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here