వర్మ బయోపిక్ దర్శకుడు, హీరో ఇతడే..!

Advertisement

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌ గాపాల్‌ వర్మ తాను ఏం చేసిన కూడా సంచలనం సృష్టిస్తుంటాడు. అలాగే ఆయన మాట్లాడే ప్రతి విషయం ఏదో ఒక వివాదలకు దారి తీస్తుంది. ఇక వర్మ ఇప్పటికి ఎన్నో బయోపిక్ లు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా వర్మ పై ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా బొమ్మాకు మురళి నిర్మాణంలో దొరసాయి తేజ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఈ సినిమాలో దొరసాయి తేజ రాముగా నటిస్తున్నాడు.

ఈ మూవీకి ‘రాము’ అనే టైటిల్ ను పెట్టారు. రామ్ గోపాల్ వర్మ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా మూడు పార్ట్‌లుగా మన ముందుకు రానుంది. మొదటి పార్ట్‌ లో రామ్‌ గోపాల్‌ వర్మ కళాశాల‌ రోజుల్లో చేసిన సందడిని చూపించనున్నారు. ఇక ఆ మొదటి పార్ట్ షూటింగ్‌ ను వర్మ తల్లి సూర్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అలాగే ఆయన సోదరి విజయ ఫస్ట్ షాట్ ‌కు క్లాప్‌ కొట్టారు. ఇక ఈ సినిమాకు సంబందించిన కొన్ని ఫొటోలను వర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇక రామ్ గోపాల్ వర్మ సినిమా అనే సరికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here