Revanth Reddy : సీఎం పదవి కోసం జగన్ సాయాన్ని కోరుతున్న రేవంత్..?

NQ Staff - December 5, 2023 / 09:57 AM IST

Revanth Reddy : సీఎం పదవి కోసం జగన్ సాయాన్ని కోరుతున్న రేవంత్..?

Revanth Reddy  :

అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జగన్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో, సీఎం పదవి విషయంలో మాత్రం మల్లగుల్లాలు పడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన సీఎం కావడానికి చాలా చిక్కులు వచ్చి పడుతున్నామయి. మరీ ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం సీనియర్ నాయకులు అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు అడ్డుపడుతున్నారు.

వీరంతా ఒక వర్గంగా ఏర్పడ్డారు. రేవంత్ సీఎం అయితే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటూ చెబుతున్నారు. దాంతో నిన్ననే సీఎం విషయంలో తేలిపోవాల్సి ఉన్నా.. ఇంకా తేలకుండా అలాగే ఉండిపోయింది. దీంతో ఇప్పుడు రేవంత్ ఏపీ సీఎం జగన్ సాయాన్ని కోరుతున్నారు. ఎందుకంటే కోమటిరెడ్డి, భట్టి, పొంగులేటి వీరంతా కూడా వైఎస్ ఫ్యామిలీతో దగ్గరి సంబంధాలు ఉన్న వారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వీరంతా మంత్రులుగా కూడా పని చేశారు. పైగా ఇప్పటికీ జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. కాబట్టి జగన్ అయితేనే దీన్ని పరిష్కరించగలరని రేవంత్ అనుకుంటున్నారు.

అందుకే ఇప్పుడు జగన్ సాయాన్ని కోరుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే నిన్న జగన్ కు రేవంత్ ఫోన్ చేశారని తెలుస్తోంది. తాను సీఎం అవ్వడానికి సహకరించమని ఖమ్మం, నల్గొండ నేతలను చెప్పాలని, మీరు చెప్తే వింటారని రేవంత్ కోరుతున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు అనుచరుడిగా పేరున్న వ్యక్తి. అందుకే ఇప్పుడు జగన్ కూడా ఎకాఎకిగా నిర్ణయం తీసుకోవట్లేదని తెలుస్తోంది. కానీ జగన్ తలచుకుంటే మాత్రం రేవంత్ సీఎం అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అందుకే రేవంత్ ఈ విషయాన్ని పసిగట్టారు. ఖమ్మం, నల్గొండ నేతలకు భారీ పదవులు ఆశ చూపినా సరే వారు మాత్రం వినట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో తమకే సీఎం పదవి కావాలంటూ కాచుకుని కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనే కాంగ్రెస్ స్వీప్ చేసింది.

Revanth Reddy Seeking YS Jagan Help For Post Of CM

Revanth Reddy Seeking YS Jagan Help For Post Of CM

అక్కడే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరినీ భట్టి, కోమటి రెడ్డి తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు రేవంత్ సీఎం కావడానికి అడ్డంకులు వచ్చి పడుతున్నాయి. చూడాలి మరి సీఎం జగన్ వారికి సర్ది చెబుతారా లేదంటే తనకెందుకులే అని సైలెంట్ గా ఉంటారా అనేది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us