Revanth Reddy Opposes YS Sharmila Joining Congress : తుమ్మల రాకతో షర్మిలకు చెక్ పెడుతున్నారా.. ఆమె నిర్ణయం ఏంటో..?

NQ Staff - August 29, 2023 / 01:38 PM IST

Revanth Reddy Opposes YS Sharmila Joining Congress : తుమ్మల రాకతో షర్మిలకు చెక్ పెడుతున్నారా.. ఆమె నిర్ణయం ఏంటో..?

Revanth Reddy Opposes YS Sharmila Joining Congress :

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంత జోరుగా పని చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా చుట్టేశారు. పైగా ఉద్యమకారుల ఇంటి వద్ద, నిరుద్యోగుల ఇంటి వద్ద టెంట్లు వేసుకుని ధర్నాలకు దిగారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఎలాగైనా తెలంగాణ ప్రజలకు చేరువ కావాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్నారు. తన వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా తెలిపారు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేసరికి ఆమె దృష్టి కాంగ్రెస్ వైపు పడింది. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తుందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.

ఆమె కూడా ఆ మధ్య పలుమార్లు ఢిల్లీ వెళ్లి డీకే శివ కుమార్ ను కలవడం, రాహుల్ గాంధీని కలిసేందుకు వెళ్లడం లాంటివి కూడా చేయడంతో పెద్ద ఎత్తున ప్రచారం జరగింది. కానీ షర్మిల కాంగ్రెస్ లోకి రావడాన్ని రేవంత్ రెడ్డి, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ సీనియర్లు మాత్రం షర్మిల రాకను సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణలో వైఎస్ కు భారీగా అభిమానులు ఉన్నారు. పైగా అప్పట్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనకు ఉంది. కాబట్టి షర్మిలను పార్టీలోకి తీసుకుంటే బాగా కలిసి వస్తుందని సీనియర్లు చెబుతున్నారు. కానీ షర్మిల పార్టీలోకి వస్తే తనకు ప్రాధాన్యత తగ్గిపోతుందని రేవంత్ భావిస్తున్నారు.

అందుకే షర్మిలను ఎలాగైనా సరే కాంగ్రెస్ లోకి రాకుండా చూడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరో ఎత్తు వేసినట్టు తెలుస్తోంది. షర్మిల మొదటి నుంచి తాను ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని చెబుతోంది. దాంతో ఇప్పుడు తుమ్మల నాగేశ్వర్ రావును రంగంలోకి దించాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. తుమ్మలకు ఇప్పుడు బీఆర్ ఎస్ లో టికెట్ ఇవ్వలేదు. కానీ తాను మాత్రం పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన బలంగా చెబుతున్నారు. కాబట్టి ఆయన్ను పార్టీలోకి తీసుకుంటే షర్మిల పాలేరు ఆశలపై నీళ్లు చల్లినట్టు అవుతుందని రేవంత్ భావిస్తున్నారు.

Revanth Reddy Opposes YS Sharmila Joining Congress

Revanth Reddy Opposes YS Sharmila Joining Congress

అలా చేస్తే షర్మిల రాజకీయ జీవితానికి మొదట్లోనే అడ్డంకి పెట్టినట్టు అవుతుంది కాబట్టి ఆమె కాంగ్రెస్ లోకి వచ్చే ఆలోచన వదులుకుంటుందని ప్లాన్ చేస్తున్నారంట. ఒకవేళ పార్టీలోకి వచ్చిన తర్వాత టికెట్ ఇవ్వమని చెప్పేసి వేరే నియోజకవర్గం ఇస్తామని చెబితే ఎలాగూ ముందు నుంచి చెబుతున్న నియోజకవర్గాన్ని కాదని ఆమె వేరే చోట నుంచి పోటీ చేయదు. అప్పుడు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తామని చెప్పి ఆమెకు తెలంగాణలో ప్రాధాన్యం లేకుండా చేయొచ్చన్నది రేవంత్ ప్లాన్.

కానీ షర్మిలను తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆమెకు కాంగ్రెస్ లో కూడా సన్నిహితులు ఎంతో మంది ఉన్నారు. ఆమె ఒక మాట చెబితే వెనక్కు తగ్గే వారు కూడా ఉంటారు. షర్మిలకు జై కొట్టేవారు కూడా చాలామందే ఉన్నారు. కాబట్టి షర్మిల ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే చెబితే బాగుంటుందని ఆమె అనుచర వర్గం వెయిట్ చేస్తోంది.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us