Revanth Reddy : ఈటల రాజేందర్ తో రేవంత్ రెడ్డి భేటీ? ఈటల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా?

Revanth Reddy : ప్రస్తుతం తెలంగాణలో ఈటల రాజేందర్ గురించే చర్చ. గత రెండు రోజుల నుంచి తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల భూకబ్జా వ్యవహారంపైనే చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ కు రైతులు లేఖ రాయడం… వెంటనే కేసీఆర్.. ఆ లేఖపై విచారణకు ఆదేశించడం.. ఆ తర్వాత మీడియాలో కథనాలు రావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 100 ఎకరాల అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ కబ్జా చేశారంటూ… మీడియాలోనూ కథనాలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అబిమానులతో పాటు… తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఈటల కూడా ప్రెస్ మీట్ పెట్టి తనకేం తెలియదని చెప్పారు. తనే తప్పు చేయలేదన్నారు. కావాలని తనపై కట్టుకథలు అల్లుతున్నారని స్పష్టం చేశారు.

revanth reddy meets etela rajender
revanth reddy meets etela rajender

ఆ తర్వాత మరుసటి రోజే ఈటల రాజేందర్ మంత్రిత్వ శాఖ అయిన వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ కు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. దీంతో కావాలని ముందస్తు ప్రణాళికతోనే ఈటల రాజేందర్ పై ఆరోపణలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏది ఏమైనా… ఈటల రాజేందర్ ప్రస్తుతం ఏ స్టెప్ వేస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

ఇంత జరిగాక… ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో ఉంటారా? వెంటనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని అంటున్నారు. అయితే… హుజూరాబాద్ కు చెందిన తన అనుచరులతో ఆయన భేటీ అవుతున్నారు. నెక్స్ ట్ ఏం చేయాలి అనే దానిపై ఆయన సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణలో ఆయనకు ఉన్న ఆప్షన్స్ రెండు.. ఒకటి కొత్త పార్టీ పెట్టడం, లేదా వేరే పార్టీలో చేరడం. కొత్త పార్టీ పెట్టడం కన్నా… ఆయన బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. ఈటల అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఈటలతో భేటీ అయ్యారట. రేవంత్ రెడ్డితోనూ ఈటల చర్చించారని… వెళ్తే కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే… ఒక్క ఈటల మాత్రమే కాకుండా.. టీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు బయటికి వెళ్లి కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు కూడా ప్రస్తుతం గుప్పుమంటున్నాయి.

మరోవైపు ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తోందట. బీజేపీలోకి ఈటల వస్తే పార్టీ బలపడుతుందని.. కరీంనగర్ జిల్లా పట్టు సాధించవచ్చని బీజేపీ ఆలోచిస్తోందట. మరి.. ఈటల రాజేందర్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అనే దాని కోసం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement