Revanth Reddy : రేవంత్ కు సీఎం పదవి.. పీసీసీ పగ్గాలు అతనికేనా..?

NQ Staff - December 7, 2023 / 09:55 AM IST

Revanth Reddy : రేవంత్ కు సీఎం పదవి.. పీసీసీ పగ్గాలు అతనికేనా..?

Revanth Reddy :

రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించాడు. అడ్రస్ లేకుండా పోతున్న పార్టీని.. భుజాలకు ఎత్తుకుని.. అతికష్టం మీద బరువును మోశాడు. తనకంటే ఉన్నతంగా పార్టీని ఎవరూ నడిపించలేరని నిరూపిస్తూ… నిత్యం ఒక ఫైటర్ లాగా పోరాడాడు. ఎంత మంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నా సరే.. పార్టీలో జోష్ మాత్రం తగ్గనివ్వలేదు. దాంతో పాటు అటు అధికార పక్షం ఎన్ని దాడులు చేస్తున్నా సరే.. సహించి ఓపిగ్గా పోరాడుతూనే ఉన్నాడు. ఆయన పోరాటానికి తగ్గ ఫలితమే నేడు కాంగ్రెస్ విజయం అని నమ్మొచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి పోరాడకుండా ఉండి ఉంటే.. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే కాదు.

అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎలాగూ సీఎం పదవి ఇవ్వబోతున్నారు. నేడు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి పీసీసీ పదవి ఎవరికి ఇస్తారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఎందుకంటే సీఎం అవుతున్న వ్యక్తికి పార్టీ పగ్గాలు ఇవ్వరు. కేవలం ఏదో ఒక పదవి మాత్రమే ఉంటుంది. రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇస్తున్నారు కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవి ఎవరో ఒకరికి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో అసలు పార్టీలో పదవి ఎవరు చేపడుతారు అనే వాదన తెరమీదకు వస్తోంది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి పేరు తెరమీదకు వస్తోంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇప్పుడు ప్రభుత్వంతో పాటు పార్టీలో కూడా కీలకమైన పదవి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవిని ఇవ్వబోతున్నారు. దాంతో పాటు పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వబోతున్నారంట. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలే కీలకంగా ఉన్నారు. వీరంతా కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల్లోనే ఉన్నారు. కాబట్టి వెంటక్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తేనే పార్టీలో ఎలాంటి చీలికలు ఉండకుండా ఉంటాయని అధిష్టానం భావిస్తోంది. వాస్తవానికి రేవంత్ తోపాటు గతంలో కోమటిరెడ్డి కూడా పీసీసీ పదవి కోసం పోటీ పడ్డారు.

Revanth Reddy Going Take Oath CM Today

Revanth Reddy Going Take Oath CM Today

కానీ ఆయనకు అప్పుడు అవకాశం దక్కలేదు. రేవంత్ రెడ్డి తర్వాత పార్టీలో బలమైన పట్టు ఉన్న నేత కేవలం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రమే. కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలుంటే 11 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీలోని కీలక నాయకుల్లో చాలామంది ఇదే జిల్లా నుండి విజయం సాధించారు.

పైగా ఖమ్మంలో ఉన్న నేతలు కూడా చాలా మంది కోమటిరెడ్డికి అనుకూలంగా ఉన్న వారే ఉన్నారు. ఎలాగూ రేవంత్ కు సీఎం పదవి ఇస్తున్నారు కాబట్టి కోమటిరెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తేనే బాగుంటుందని అంటున్నారు. చూడాలి మరి ఎవరికి పదవి దక్కుతుందో.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us