సిద్దిపేటోని పెత్తనం దుబ్బాకలేంది. హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.

Admin - October 30, 2020 / 02:03 PM IST

సిద్దిపేటోని పెత్తనం దుబ్బాకలేంది. హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.

తెలంగాణాలో అందరి చూపు దుబ్బాక ఉపఎన్నికల వైపే ఉంది. ఇక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మాత్రం ఈ ఉపఎన్నిక కీలక పరీక్షా కానుంది. ఇక ఎలాగైనా దుబ్బాకలో గెలవాలని అన్ని పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. ఇక ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును ఎలాగైనా మరల కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ కీలకంగా పనిచేస్తుంది. ఇక దుబ్బాక ప్రచార బాధ్యతలను ఆర్థిక మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కు కట్టబెట్టాడు సీఎం కెసిఆర్.

దీనితో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లపై తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నాడు హరీష్. ఇక ఇదే నేపథ్యంలో హరీష్ రావు పై టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసాడు. ‘దుబ్బాకలో అసలు దమ్మున్న నాయకుడు లేడా.. గా సిద్దిపేటోని పెత్తనం ఇక్కడ ఏంది’ అని హరీష్ రావు ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. ఏడేండ్లుగా మంత్రిగా ఉన్న హరీష్ దుబ్బాకకు ఏం ఎలగబెట్టాడని ఫైర్ అయ్యాడు.

తెలంగాణాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 100 మంది ఉన్నారని, దుబ్బాకలో గెలిచి చేసేది ఏమి లేదని పేర్కొన్నాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజల మనిషని, శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్ర ప్రజలందరూ సంతోష పడుతారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు. దుబ్బాకలో శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తే తన తండ్రి ముత్యం రెడ్డి లాగా అభివృద్ధి చేస్తాడని వెల్లడించాడు. ఇక ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడును పెంచాయి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us