Revanth Reddy : రైతుబంధు ఆపిన పాపం హరీవ్ రావుదే.. రేవంత్ రెడ్డి ఫైర్..!

NQ Staff - November 28, 2023 / 09:59 AM IST

Revanth Reddy : రైతుబంధు ఆపిన పాపం హరీవ్ రావుదే.. రేవంత్ రెడ్డి ఫైర్..!

Revanth Reddy :

ఇప్పుడు కాంగ్రెస్ కు మరో అస్త్రం దొరికినట్టు అయిపోయింది. ఎప్పుడు ఏ చిన్న అస్త్రం దొరికినా సరే దాన్ని సక్సెస్ ఫుల్ గా వాడేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే రైతుబంధు విషయంలో ఆయనకు దక్కిన అవకాశాన్ని సంపూర్ణంగా వాడేసుకోవడానికి రెడీ అయ్యారు రేవంత్ రెడ్డి. రైతుబంధు ఇచ్చేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం.. ఆ తర్వాత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని మళ్లీ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలపడం మన చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే రైతుబంధు ఆపేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.

హరీశ్ రావు నోటి దురుసు వల్లనే రైతుబంధు ఆగిపోయింది. ఆయన కావాలనే రైతుల నోట్లో మట్టిగొట్టి రైతుబంధును ఆపేశాడు అంటూ రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాబట్టి రైతులకు అన్యాయం చేసిన కేసీఆర్, హరీశ్ రావులను చిత్తు చిత్తుగా ఓడించాలంటూ కోరారు రేవంత్ రెడ్డి. డోర్నకల్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరీశ్ రావునోటి దురుసు మీద కేసీఆర్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వాస్తవానికి రైతుబంధును ఇవ్వలంటూ ఈసీని కోరింది తామే అంటూ తెలిపారు రేవంత్.

కానీ ఎన్నికల సమయంలో రైతబంధు ఇవ్వడం కుదరదని ఈసీ తెలిపింది. రైతబుంధు డబ్బులు వేసి ఓట్లు దండుకోవాలని బీఆర్ ఎస్ ప్లాన్ చేసింది కానీ ఆ పార్టీ కుట్రలు బయట పడటంతో ఇప్పుడు ముఖం చూపించలేకపోతున్నారు. కుట్రలు చేసి ఓట్లు దన్నుకోవాలని చూసి చివరకు రైతుబంధు డబ్బులు రైతులకు రాకుండా అడ్డుకుని వాళ్ల నోట్లో మట్టి కొట్టారంటూ వాపోయారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలోనే అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం కేసీఆర్. ఇతర రాష్ట్రాల్లో కంటే మన తెలంగాణలోనే పెట్రోల్ మీద వ్యాట్ ఎక్కువ ఉంది.

కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దాన్ని తగ్గిస్తాం. రైతుల ఖాతాల్లో రూ.15వేలు వేసి వారి రుణం తీర్చుకుంటాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ కూడా చేస్తాం. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే. దాన్ని రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టారు.

అంటే కాంగ్రెస్ హయాంలోనే ఇవన్నీ మొదలయ్యాయి. కాబట్టి ఇందులో కేసీఆర్ గొప్పతనం ఏమీ లేదు. ఆయన కుటుంబానికి తప్పి ఇంకెవరికీ జాబులు చూపించే అలవాటు ఆయనకు లేదు. కాబట్టి అలాంటి కేసీఆర్ మాటలు నమ్మి మోసపోకండి. రాబోయేది మన కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు రేవంత్.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెతలాగా.. రైతుబంధు ఇచ్చేందుకు ఈసీ అనుమతులు ఇచ్చినా అల్లుడి నోటిదురుసు కారణంగా మళ్లీ ఆగిపోయిందన్నారు. రైతుబంధు ఆగిందని రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసం లేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.15 వేలు ఇస్తామని తెలిపారు. రైతులతో పాటు రైతు కూలీలను కూడా ఆదుకుంటామన్నారు. ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us