Revanth Reddy : వైరల్ వీడియో : బీజేపీ నాయకులతో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్
NQ Staff - February 1, 2023 / 08:33 PM IST

Revanth Reddy : ఒకవైపు తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతూ రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మేమే పోటీ అంటే మేము పోటీ అంటూ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటా పోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న ఈ సమయంలోనే ఢిల్లీలో మాత్రం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న ఈ ఇద్దరు ఎంపీలు ఒకానొక సందర్భంలో ఎదురయ్యారు.
రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నవ్వుతూ పలకరించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాష్ట్రంలో బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు కొట్లాడుకుంటూ ఉంటే అధ్యక్షులు మాత్రం ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కార్యకర్తలను వెర్రి వాళ్ళని చేస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
అధికార బీఆర్ఎస్ పార్టీ వారు మాత్రం కాంగ్రెస్ మరియు బీజేపీ మిత్రపక్షాలే అని ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అన్నట్లుగా విమర్శలు చేస్తున్నారు.