Revanth Reddy : కేసీఆర్ ది కమీషన్ల కుటుంబం.. రేవంత్ తీవ్ర ఆరోపణలు…!

NQ Staff - November 29, 2023 / 01:24 PM IST

Revanth Reddy : కేసీఆర్ ది కమీషన్ల కుటుంబం.. రేవంత్ తీవ్ర ఆరోపణలు…!

Revanth Reddy :

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. తాజాగా డోర్నకల్ నియోజకవర్గంలోడాక్టర్ రాం చంద్రునాయక్ కు మద్దతుగాప్రచారం నిర్వహించారు. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్యా నాయక్ కు సర్పంచ్ నుంచి మంత్రి పదవి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ పాలిచిన తల్లి రొమ్ము మీద తన్నినట్టు కాంగ్రెస్ ను కాలదన్ని వెళ్లిపోయాడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు కాంగ్రెస్ ను గెలిపించి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ పంచన చేరి.. ఆయనలాగానే కమీషన్లకు అలవాటు పడ్డాడు రెడ్యా నాయక్.

రెండ్యా కొండుకు బియ్యం దందాలు, ఆయన భార్య ఇసుక దందాలు చేస్తూ కమీషన్లు దండుకుంటున్నారు. నియోజకవర్గాన్ని సర్వ నాశనం చేస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలు ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. గిరిజనులను చదువుకు దూరం చేసేందుకు కుట్ర జరుగుతోంది. గిరిజన బిడ్డలు చదువుకుంటే వీరిని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే చదువుకు దూరం చేయాలనే కుట్ర జరుగుతోంది. అందుకే ఇప్పటి వరకు ఇక్కడ కాలేజీలను ఏర్పాటు చేయట్లేదు. ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదంటేనే ఇక్కడ పాలన ఎలా సాగుతుందో అర్థం చేసుకోవాలి.

కేసీఆర్ ది దొరల అహంకార ప్రభుత్వం. ఆయన కులపోళ్లు తప్ప ఇంకెవరూ చదువుకోవడం ఆయనకు ఇష్టం ఉండదు. అందుకే కేజీ టు పీజీ విద్యాలయాలను డోర్నకల్ లో పెట్టలేదు. గిరిజనులను రాజకీయంగా, చైతన్య వంతం కాకుండా చేయాలన్నది కేసీఆర్ ఉద్దేశం. అందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు. నాగార్జున సాగర్, కృష్ణానది జలాలు పక్కనుంచే వెళ్తున్నా సరే నియోజకవర్గానికి మాత్రం నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదో రెడ్యా నాయక్, కేసీఆర్ ఇద్దరూ సమాధానం చెప్పాలి. ఆ జలాలను గనక మళ్లించి ఉంటే ఈ పాటికి నియోజకవర్గం మొత్తం సస్య శ్యామలం అయి ఉండేది.

కానీ అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల వరకు నొక్కేశారు. ఆ అవినీతిని ప్రశ్నించొద్దనే డోర్నకల్ లో కాలేజీలు ఏర్పాటు చేయట్లేదు. కాళేశ్వరం అంత గొప్ప ప్రాజెక్ట్ అయితే పక్కనే ఉన్న డోర్నకల్ కు ఎందుకు నీళ్లు రావట్లేదు.

అక్కడెక్కడో ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్తున్నారు గానీ.. ఇక్కడున్న గిరిజన బిడ్డలకు మాత్రం సాగునీరు అందకుండా కుట్రలు చేస్తున్నారు. ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వాలు ఉండవు. ధరణి తీసుకువచ్చి గిరిజనులకు ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు ఇచ్చిన భూమలుకు పట్టాలు ఇస్తాం.. ఓటేయండని కోరారు రేవంత్ రెడ్డి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us