Renuka Chaudhary : టీడీపీ మద్దతును బయట పెడుతున్న కాంగ్రెస్ నేతలు.. ఇది నష్టమే..!

NQ Staff - November 21, 2023 / 12:17 PM IST

Renuka Chaudhary : టీడీపీ మద్దతును బయట పెడుతున్న కాంగ్రెస్ నేతలు.. ఇది నష్టమే..!

Renuka Chaudhary :

కాంగ్రెస్ ఎన్నికల వేళ గ్రాఫ్‌ పెరుగుతున్నది వాస్తవమేనని ప్రతిపక్ష పార్టీలు కూడా నమ్ముతున్నాయి. అందుకే ఇప్పుడు కేసీఆర్ కూడా తన ఎన్నికల ప్రచార సభల్లో కేవలం కాంగ్రెస్ ను మాత్రమే తిడుతున్నారు తప్ప బీజేపీని పెద్దగా పట్టించుకోవట్లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టే ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్‌ పెరుగుతోంది. పైగా ఎన్నికల సమయంలో అందరూ ఏకతాటి మీదకు కూడా వస్తున్నారు. పైగా రేవంత్ రెడ్డి తన ప్రతి ప్రసంగంలో ప్రజలను ఆకట్టుకునేలా తన ప్రసంగంలో వాడి వేడి పెంచుతున్నారు. పైగా రేవంత్ రెడ్డి మేనిఫెస్టోను బలంగా ప్రచారం చేయిస్తున్నారు.

ఇలాంటి సమయంలో కాంగ్రెస్ టీడీపీ మద్దతు తీసుకుంటుందనే ప్రచారం తెరమీదకు రావడం అస్సలు మంచిది కాదు. టీటీడీపీ పార్టీ ఈ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయట్లేదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ విషయం ప్రజల్లో బలంగా ప్రచారం కానివ్వకుండా రేవంత్ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని బయట పెట్టేసి పార్టీకి నష్టం తెచ్చే పనులు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన రేణుకా చౌదరి ఇదే విషయాన్ని బయట పెట్టారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీటీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందా అని ఆమెను మీడియా ప్రతినిధులు అడిగారు. దానికి ఆమె సమాధానం చెబుతూ.. ఒకప్పుడు చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పుడు మేం సపోర్ట్ చేశాం. ఇప్పుడు చంద్రబాబు మాకు మద్దతు ఇస్తున్నారు అంతే అంటూ ఆమె చెప్పుకొచ్చారు. దాంతో అప్పటి నుంచి ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ కు నష్టమే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఎందుకంటే చంద్రబాబు పేరు చెబితే ఆటోమేటిక్ గా బీఆర్ ఎస్ తెలంగాణ సెంటిమెంట్ ను బయట పెడుతుంది.

Renuka Chaudhary Said Chandrababu Supporting Congress

Renuka Chaudhary Said Chandrababu Supporting Congress

దాని వల్ల కాంగ్రెస్ గెలిచినా చంద్రబాబు గెలిచినట్టే అవుతుందంటూ బీఆర్ ఎస్ ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబు మద్దతు తీసుకుంటే గత ఎన్నికల్లో మాదిరిగి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో రేవంత్ నేరుగా మద్దతు తీసుకోలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా చూశారని మాత్రం చెబుతున్నారు.

అయితే ఇప్పుడు ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటే మాత్రం దాన్ని బీఆర్ ఎస్ నేతలకు ప్రచార అస్త్రంగా మార్చినట్టు అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి చేజేతులా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకున్నట్టే అవుతుంది. రేవంత్ చేసిన ప్రయత్నాలన్నీ వృథానే అవుతాయి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us