Renu Desai : లైక్ నాన్న.. లైక్ కూతురు: ఆద్య వీడియో పోస్ట్ చేసిన రేణుదేశాయ్
NQ Staff - November 14, 2022 / 07:11 AM IST

Renu Desai : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కారణం, ఆ వీడియోను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ చేయడమే.
పైగా, ఆ వీడియో పోస్ట్ చేస్తూ రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ యాడ్ చేశారు. ‘లైక్ నాన్న.. లైక్ కూతురు..’ అంటూ రేణు దేశాయ్ పేర్కొనడం గమనార్హం. ‘నాన్నలానే కూతురు కూడా..’ అని రేణుదేశాయ్ ఎందుకు పేర్కొన్నారో తెలుసా.? ఆ వీడియో అలా వుంది మరి.!
కారులో ఆద్య షికారు..
కారు సన్ రూఫ్లోంచి ఆద్య పైకి కనిపించేలా ప్రయాణాను భూతిని ఎంజాయ్ చేస్తోంది ఈ వీడియోలో. ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం వెళ్ళేందుకు మంగళగిరి నుంచి కారులో జనసేనాని, ఆ కారు మీదకెక్కి కూర్చుని ప్రయాణించిన సంగతి తెలిసిందే.
‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ అనే ఆటిట్యూడ్ పవన్ కళ్యాణ్ చూపించారు. దాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా ‘నాన్నలానే కూతురు కూడా..’ అని రేణు దేశాయ్ ఈ వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం.
‘ఔను, నాన్నలాగానే కూతురు..’ అంటూ పవన్ కళ్యాణ్ వీడియోకి ఆద్య వీడియోను జత చేసి పవన్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.