టిక్ టాక్ ని కొనబోతున్న రిలయన్స్ ??

Advertisement

ఇండియా-చైనాల మధ్య సరిహద్దు వివాదం మొదలైన తరువాత టిక్ టాక్ లాంటి ఎన్నో చైనా యాప్స్ ను భద్రతాపరమైన అంశాల వల్ల బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇండియాలో కొన్ని లక్షల మంది టిక్ టాక్ కు అడిక్ట్ అయిపోయారు. టిక్ టాక్ ఇండియాలో తనకు ఉన్న యూజర్ బేస్ ను కాపాడుకోవడానికి ఇండియాలో ఉన్న రిలయన్స్ కంపెనీతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కథనాన్ని టెక్ క్రంచ్ ప్రచురించింది.

గత నెలలో రెండు కంపెనీల మధ్య చర్చలు ప్రారంభం అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని టెక్ క్రంచ్ వెల్లడించింది. అయితే వార్తలపై రిలయన్స్ సంస్థ గాని,టిక్ టాక్ మాతృ సంస్థ ఐన బైట్ డాన్స్ గాని ఏమి స్పందించలేదు. మరికొన్ని రోజుల్లో టిక్ టాక్ ను అమెరికాలో కూడా బ్యాన్ చేయనున్న విషయం తెలిసిందే. నిజంగా బైట్ డాన్స్ సంస్థ రిలయన్స్ కంపెనీతో చర్చలు జరిపింది నిజమైతే టిక్ టాక్ మళ్ళీ అందుబాటులోకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here