Deep Fake Technology : డీప్ ఫేక్ టెక్నాలజీ ఏంటీ? ఆనంద్ మహీంద్ర ఆందోళన ఎందుకు?
NQ Staff - January 21, 2023 / 06:49 PM IST

Deep Fake Technology : టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లో ఎప్పటికప్పుడు అద్భుతమైన యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అందులో కొన్ని సమాజ హితానికి అన్నట్లు ఉండగా మరికొన్ని మాత్రం చేటు చేసేదిగా ఉన్నాయి.
తాజాగా డీప్ ఫేక్ అనే టెక్నాలజీ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ సాయంతో వీడియో లోని వ్యక్తుల ఫేస్ లను వేరు వేరుగా చూపించవచ్చు. ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల యొక్క మొహాలతో దాదాపు 90% మ్యాచ్ చేస్తూ కనిపించవచ్చు.
తాజాగా ఒక యువకుడు విరాట్ కోహ్లీ, షారుక్ ఖాన్ ఇంకా పలువురు ప్రముఖుల యొక్క ఫేస్ ని ఉపయోగించి వీడియోను చేయడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆ వీడియోని షేర్ చేసి ఇది ఎంత మాత్రం సరైన టెక్నాలజీ కాదు, ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసే పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సమాజంలో ఇటువంటి టెక్నాలజీతో మోసపూరిత కంటెంట్ క్రియేట్ చేసి జనాలను మోసం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సెలబ్రిటీల యొక్క ఫేస్ తో డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి వీడియోలు చేసి సామాన్యులలో మోసం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక ఇలాంటి యాప్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం కూడా ఈ యాప్స్ ని బ్యాన్ చేయడం మంచిదన్నట్లుగా ఆయన అభిప్రాయం చేశారు.
This clip which has been making the rounds is rightfully raising an alarm. How’re we preparing, as a society, to guard against potentially deceptive content which at best, can be mildly entertaining, but at worst, divide us all? Can there be tech-checks that act as a safeguard? pic.twitter.com/wSmvGi4lQu
— anand mahindra (@anandmahindra) January 21, 2023