Rashmika Mandanna : ఆ పని ఎక్కువగా చేస్తే నాకు బ్యాక్ పెయిన్ వస్తోంది.. రష్మిక బోల్డ్ ఆన్సర్..!
NQ Staff - March 24, 2023 / 07:57 PM IST

Rashmika Mandanna : రష్మిక పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మార్మోగిపోతోంది. ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. పైగా చేతిలో ఉన్నవన్నీ పెద్ద ప్రాజెక్టులే కావడం ఇంకో విషయం. అయితే కెరీర్ పరంగానే కాకుండా ఆమె వ్యక్తిగత విషయాలతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తోందంటూ ఎప్పటి నుంచో రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి మాల్దీవులకు ట్రిప్ కు కూడా వెళ్తున్నారు. ఇక రష్మికకి ఫ్యాన్స్ తో లైవ్ లో ముచ్చటిస్తున్నప్పుడు మధ్యలో విజయ్ వాయిస్ కూడా వినిపించింది. దాంతో వీరిద్దరి డేటింగ్ ను అంతా కన్ఫర్మ్ చేసేస్తున్నారు.
ఆ కోరిక కోరడంతో..
ఇదిలా ఉండగా అప్పుడప్పుడు రష్మిక తన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో ఆమెను ఓ ఫ్యాన్ సామి సామి సాంగ్ కు నీతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉందంటూ అడిగాడు. దానికి రష్మకి కూడా స్పందించింది.
ప్రతిసారి సామీసామీ పాటకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికే చాలాసార్లు చేశాను. అలా చేయడం వల్ల నాకు వయసు అయిపోయాక బ్యాక్ పెయిన్ వస్తుందేమో అని భయం వేస్తోంది. కాబట్టి మనం ఇంకేదైనా సాంగ్ కు మనం కలిసినప్పుడు చేద్దాం అంటూ తన ఫ్యాన్ ను ఖుషీ చేసింది ఈ ముద్దుగుమ్మ.
I’ve done saami saami step tooooo many times.. that now I feel like I’ll have issues with my back when I get older.. why you do this to me re.. ? let’s do something else when me meet. ? https://t.co/ao8ssA6HBP
— Rashmika Mandanna (@iamRashmika) March 20, 2023