Cute Baby : ఈ క్యూట్ పాప ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టండి..!
NQ Staff - January 27, 2023 / 10:57 AM IST

Cute Baby : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సినీ తారలకు సంబంధించిన విషయాలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. వారి వ్యక్తిగత విషయాలు అంటే మాత్రం వారి ఫ్యాన్స్‌కు మహా ఇంట్రెస్ట్ అనే చెప్పుకోవాలి. అందుకే సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్‌ను వైరల్ చేస్తూ ఉంటారు.
ఇక సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు కూడా ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. ఇలా వైరల్ చేసిన ఫొటోలను చూపించి వీరు ఎవరు అని ఫజిల్ లాంటి గేమ్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఓ ముద్దులొలికే పాప ఫొటో వైరల్ అవుతుంది. ముట్టుకుంటేనే కరిచేసేలా చూస్తున్న ఈ పాప ఎవరో గుర్తుపట్టండి.
భారీ క్రేజ్..

Recently Cute Baby Photo Gone Viral
ఏంటీ మీ వల్ల కావట్లేదా.. అయితే నేను చెప్పేస్తున్నా వినండి. ఆమె ఎవరో కాదండోయ్ కోట్లాదిమంది కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టిన సాయిపల్లవి. ఈ లేడీ పవర్ స్టార్ కు ఉన్న ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా తక్కువ సమయంలోనే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఆమె అందాలను ఆరబోయకుండా కేవలం తన నటనతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. ఈ జనరేషన్ లో ఇలా అందాలను చూపించుకుండా కేవలం నటనతోనే ఎదిగిన హీరోయిన్ అంటే కేవలం సాయిపల్లవి అనే చెప్పుకోవాలేమో. మరి ఆమె చిన్నప్పటి ఫొటో ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి.