Posani Krishna Murali : పవన్ కళ్యాణ్‌పై దూషణలు: రాజమండ్రిలో పోసాని కృష్ణమురలిపై కేసు నమోదు.!

NQ Staff - November 19, 2022 / 10:33 PM IST

Posani Krishna Murali : పవన్ కళ్యాణ్‌పై దూషణలు: రాజమండ్రిలో పోసాని కృష్ణమురలిపై కేసు నమోదు.!

Posani Krishna Murali  : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కొన్నాళ్ళ క్రితం అత్యంత అసభ్యకరమైన రీతిలో, జుగుప్సాకరమైన పదజాలంతో తిట్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అప్పట్లో జనసేన శ్రేణులు పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశాయి.

అయితే, చాలా చోట్ల పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. కాగా, తాజాగా రాజమండ్రిలో పోసాని కృష్ణమురళిపై కేసు నమోదయ్యింది.

కోర్టు చీవాట్లు పెట్టడంతోనే…

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, జనసేన నేతలు న్యాయస్థానాన్ని ఈ విషయమై ఆశ్రయించి, న్యాయస్థానం నుంచి సానుకూల స్పందన పొందినట్లు తెలుస్తోంది.

న్యాయస్థానం సూచనల మేరకే విధిలేని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారట. అయితే, పోసాని కృష్ణమురళి విషయంలో అధికార పార్టీ పెద్దల్ని కాదని, పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం వుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.

ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధితుల మీద తప్ప, బాధ్యుల మీద కేసులు నమోదవవు.. ఒకవేళ బాధ్యులపై కేసులు నమోదైనా, వారికి రాచమర్యాదలు లభిస్తుంటాయి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us