నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ప్రభాస్ పొరితోషికం ఎంతో చూడండి

Advertisement

బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ ప్రభాస్ క్రేజ్ ను మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఈ మూవీ ఇచ్చిన క్రేజ్ మూలంగానే బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం కథ పరంగా ప్రజలకు ఆకట్టుకోకపోయినా, కలెక్షన్స్ భారీగా వసూలు చేసింది. జపాన్ లో కూడా సాహో మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ సినిమాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజిని కాంత్ లాంటి హీరోలకు భాషలకు అతీతంగా అభిమానులు ఉండటంతో వారు అధిక పారితోషకాన్ని అందుకుంటున్నారు. ప్రభాస్ ఇప్పుడు ఈ అగ్ర హీరోల సరసన చేరబోతున్నాడని సినీ పండితులు చెప్తున్నారు.

వైజయంతి పతాకంలో నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో ప్రభాస్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మూవీకి ప్రభాస్ తీసుకోబోతున్న పారితోషికంపై సినీ పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ మూవీ ప్రభాస్ ఏకంగా రూ. 50 కోట్లకు పైనే తీసుకోబోతున్నాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఈ పారితోషికాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

ప్రభాస్ ఒకవేళ ఈ చిత్రానికి రూ. 50 కోట్లు తీసుకొన్నట్లయితే ప్రభాస్ కూడా ఈ ఒక్క చిత్రంతోనే షారుఖ్ ఖాన్, రజిని కాంత్, అమీర్ ఖాన్ లాంటి అగ్ర హీరోల జాబితాలో చేరిపోతారు. అయితే ప్రస్తుతం జిల్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నార్తు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ కూడా ఈమధ్యే విడుదల కాగా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సాహోతో నిరాశపరిచిన ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంతో అలరిస్తాడాని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here