Realme Phone : 9 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయ్యే ఫోన్ వచ్చేసిందోచ్
NQ Staff - January 4, 2023 / 11:26 PM IST

Realme Phone : అర్జంట్ గా బయటకు వెళ్లాలి.. అప్పుడు ఫోన్ లో చార్జింగ్ తక్కువగా ఉంటుంది. బయటకు వెళ్లిన చోట చార్జింగ్ పెట్టడానికి వీలు ఉండదు. దాంతో ఫుల్ చేసుకుని వెళ్లాలి అనుకుంటే కనీసం అర్థగంట సమయం అయినా పడుతుంది. కానీ ఇక నుండి కేవలం 9 నిమిషాల్లో జీరో నుండి నూరు శాతం చార్జింగ్ అయ్యే స్మార్ట్ ఫోన్ లు వస్తున్నాయి.
Realme వారు కొత్తగా తీసుకు వచ్చిన స్మార్ట్ ఫోన్ కి 240 వాట్స్ చార్జింగ్ ఫీచర్ ను ఇవ్వడం జరిగింది. సాధారణంగా 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో 210 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్స్ కొన్ని వచ్చాయి. వాటిని మించి Realme వారి నుండి 9 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అయ్యే ఫోన్ లు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
చూడ్డానికి సాధారణ చార్జర్ మాదిరిగా ఉన్నా కూడా Realme Phone యొక్క ఈ చార్జర్ ఖరీదు కూడా పెద్ద మొత్తంలో ఏమీ లేదని మార్కెట్ వర్గాల వారు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో Realme Phone సంస్థ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ 240 వాట్ చార్జింగ్ యొక్క చార్జర్ స్మార్ట్ ఫోన్ సక్సెస్ అయితే కచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ యుగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.